Ajith Kumar New Car :తన భర్త, కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ఓ లగ్జరీ కారు కొన్న విషయాన్ని షాలిని తన సోషల్ మీడియా ఇన్‌స్టా అకౌంట్లో పోస్ట్ చేశారు. "ఆయన కారును, స్టైల్‌ను, నా హృదయాన్ని గెలుచుకున్నారు" అనే క్యాప్షన్ రాసుకొచ్చింది. ఈ సందర్భంగా తన కొత్త కారుతో అజిత్ దిగిన ఫొటోను పోస్ట్ చేసింది. కాగా, అజిత్ పోర్షె 911 జీటీ3 ఆర్ఎస్ కారును కొనుగోలు చేశారు. ఈ కారు ధర దాదాపు రూ.4 కోట్లు ఉంటుందని సమాచారం. . ఈ కారు గంటకు గరిష్ఠంగా 296 కి.మీ. వేగంతో ప్రయాణించగలదు. ఇకపోతే గత నెలలోనూ అజిత్ దుబాయ్‌లో మరో లగ్జరీ కారును కొనుగోలు చేశారు. ఫెరారీ ఎఫ్8 ట్రిబ్యూటో కారును కొన్నారు. ఇది గంటకు గరిష్ఠంగా 340కి.మీ వేగంతో దూసుకెళ్తుంది.
Ajith Kumar Car Collections :ఇంకా అజిత్ గ్యారేజీలో మరెన్నో విలాసవంతమైన కార్లు, బైకులు కూడా ఉన్నాయి. ఇందులో రూ.4 కోట్ల ఫెరారీ 458 ఇటాలియా, రూ.1.3 కోట్ల ల్యాండ్ రోవర్ డిస్కవరీ, రూ.1.5 కోట్ల బీఎండబ్ల్యూ 740 లీ, రూ.1.35 కోట్ల మెర్సెడీస్ బెంజ్ 350 జీఎల్ఎస్, రూ.90 లక్షల వోల్వో ఎక్స్‌సీ 90 కార్లు ఉన్నాయి.
Ajith Kumar Bike Collections :బైకుల విషయానికొస్తే రూ.24 లక్షల బీఎండబ్ల్యూ ఎస్1000ఆర్ఆర్, రూ.20 లక్షల అప్రిలియా కాపోనోర్డ్ 1200, రూ.21 లక్షల బీఎండబ్ల్యూ కే1300 ఎస్, రూ.19.7 లక్షల కవాసకీ నింజా జెడ్ఎక్స్ 14ఆర్లు ఉన్నాయి.