KA Movie Collections :టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లీడ్ రోల్లో నటించిన లేటెస్ట్ సినిమా 'క'. యువ డైరెక్టర్లు సుజీత్ - సందీప్ సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కించారు. యంగ్ బ్యూటీ నయన్ సారిక హీరోయిన్గా నటించింది. 2024 దీపావళి బరిలో నిలిచిన ఈ మూవీ భారీ విజయం అందుకుంది. రోజు రోజుకీ వసూళ్లు పెరుగుతున్నాయి. వీకెండ్లో దాదాపు 80శాతం ఆక్యుపెన్సీతో రన్ అయ్యింది. దీంతో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది.
డే 1 నుంచే సినిమాకు సూపర్ హిట్ టాక్ రావడం వల్ల నాలుగు రోజులుగా బాక్సాఫీస్ వద్ద నిలకడగా వసూళ్లు సాధిస్తోంది. ఇక నాలుగో రోజు కూడా ఈ చిత్రం భారీ స్థాయిలోనే కలెక్షన్లు రాబట్టింది. వీకెండ్ కావడం వల్ల హైదరాబాద్లో దాదాపు అన్ని థియేటర్లలో హౌస్ఫుల్ బోర్డులు దర్శనమిచ్చాయి. ఈ సినిమా ఆదివారం రూ.3.75 కోట్లు నెట్ వసూల్ చేసినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. అంటే డే 1నుంచి నాలుగో రోజే ఈ సినిమా అత్యధికంగా వసూల్ చేసింది. ఇప్పటివరకూ 'క' చిత్రం నాలుగు రోజుల్లో రూ.14.15 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించినట్లు అంచనా. దీంతో బ్రేక్ ఈవెన్ పూర్తైనట్లు తెలుస్తోంది.
'క' మూవీ నెట్ వసూళ్లు (భారత్లో)
- తొలి రోజు - రూ.3.5 కోట్లు
- రెండో రోజు- రూ. 3 కోట్లు
- మూడో రోజు- రూ. 3.6 కోట్లు
- నాలుగో రోజు- రూ. 3.75 కోట్లు