తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

కీర్తి సురేశ్ పెళ్లి ఫిక్స్!- గోవాలో వెడ్డింగ్- వరుడు ఎవరంటే?

బాయ్​ఫ్రెండ్​తో కీర్తి సురేశ్ పెళ్లి- 16ఏళ్ల రిలేషన్​షిప్ అంట!

Keerthy Suresh Marriage
Keerthy Suresh Marriage (Source : ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : 5 hours ago

Keerthy Suresh Marriage :సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ గురించి సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 'నేను శైలజ' సినిమాతో టాలీవుడ్ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ తక్కువ కాలంలోనే స్టార్ స్టేటస్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. 'మహానటి' సినిమాతో ఇండియా వైడ్​గా పాపులరై, నేషనల్ అవార్డ్ దక్కించుకుంది. అయితే కీర్తి సురేశ్ గురించి సోషల్ మీడియాలో ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది.

డెస్టినేషన్ వెడ్డింగ్!
మరికొన్ని రోజుల్లోనే కీర్తి సురేశ్ పెళ్లి చేసుకోబోతుందంటూ ఓ వార్త వైరల్ అవుతోంది. తన ఫ్రెండ్, ప్రియుడు ఆంటోని తట్టిల్​ను కీర్తి సురేశ్ పెళ్లాడనున్నారని కోలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. వాళ్లిద్దరిది 16ఏళ్ల ప్రేమ బంధం అని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఇక ఈ జంట డిసెంబరు 11న గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నారని సమాచారం. ఎక్కడా ఆ విషయం బయటపడకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

క్లారిటీ మాత్రం!
అయితే కీర్తి సురేశ్ పెళ్లిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీనిపై కీర్తి నుంచి గానీ, ఆమె కుటుంబ సభ్యులుగానీ ఇంకా స్పందించలేదు. కానీ, కీర్తి మ్యారెజ్ గురించి మాత్రం కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఊహగానాలు వినిపిస్తున్నాయి.

గతంలోనూ
కీర్తి సురేశ్ పెళ్లి గురించి రూమర్స్ రావడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ అనేకసార్లు ఈ బ్యూటీ మ్యారేజ్ పై రూమర్స్ వచ్చాయి. బిజినెస్ మ్యాన్, ఫ్యామిలీ ఫ్రెండ్, మ్యూజిక్ డైరెక్టర్, నిర్మాత ఇలా ఎంతో మంది పేర్లు బయటకు వచ్చాయి. అయితే తమ కూతురి పెళ్లి గురించి వస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదని కీర్తి సురేశ్ తల్లిదండ్రులు ఖండించారు. అలాగే తన ప్రేమ, పెళ్లిపై గతంలోనూ కీర్తి సురేశ్ క్లారిటీ ఇచ్చింది. ఇక ఇప్పుడు మరోసారి కీర్తి పెళ్లి రూమర్స్ తెరపైకి వచ్చాయి. మరీ ఈసారి సౌత్ ఇండియన్ బ్యూటీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

కాగా, ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ సరసన ఓ సినిమాలో కీర్తి సురేశ్ నటిస్తోంది. ఈ క్రమంలో ఆమె ముంబయికి మార్చింది. ఇటీవల రఘ తాత సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కీర్తి సురేశ్ తన నటనతో మంచి మార్కులు కొట్టేసింది.

Keerthy Suresh Marriage : ఆ మ్యూజిక్​ డైరెక్టర్​తో కీర్తి సురేశ్​ పెళ్లి.. నటి తండ్రి క్లారిటీ

కీర్తి సురేశ్ లగ్జరీ లైఫ్​ - విలాసవంతమైన ఇళ్లు, కాస్ట్లీ కార్లు - నెట్​వర్త్​ ఎన్ని కోట్లంటే?

ABOUT THE AUTHOR

...view details