తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

సామ్​పై 'బేబీ జాన్' హీరోయిన్ ప్రశంసలు - వాయిస్ మెసేజ్ పంపి మరీ! - KEERTHY SURESH ABOUT SAMANTHA

సామ్​పై 'బేబీ జాన్' హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్ - ఇలాంటివి నీకు మాత్రమే సాధ్యమని ప్రశంసలు - ఆ వాయిస్ మెసేజ్​లో ఏముందంటే?

Keerthy Suresh About Samantha
Keerthy Suresh About Samantha (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jan 15, 2025, 4:29 PM IST

Updated : Jan 15, 2025, 5:17 PM IST

Keerthy Suresh About Samantha : సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది తమ కో స్టార్స్​తో బెస్ట్​ ఫ్రెండ్స్​ అయినా వారిని చూసుంటాం. అటువంటి వారిలోసమంత, కీర్తిసురేశ్ పేర్లు బాగా వినిపిస్తుంటాది. ఈ ఇద్దరూ ఎప్పటి నుంచి మంచి మిత్రులన్న సంగతి అందరికీ తెలిసిందే. పలు ఈవెంట్స్​లో సోషల్ మీడియా ప్లాట్​ఫామ్స్​లో తమకున్న అనుబంధాన్ని తెలియజేస్తూ కనిపిస్తుంటారు. ఈ క్రమంలో ఇప్పటికే సమంతపై తన ఇష్టాన్ని పలు సందర్భాల్లో చెప్పుకున్న కీర్తి, తాజాగా మరోసారి సామ్‌పై ప్రశంసలు కురిపించారు. తాజాగా ఆమె హాజరైన ఓ ఇంటర్వ్యూలో సమంతకు సర్‌ప్రైజ్‌ వాయిస్‌ మెసేజ్‌ పంపారు కీర్తి. ఇంతకీ అందులో ఏముందంటే?

'ఇటువంటివి నీకు మాత్రమే సాధ్యం'
"సమంత నీతో నాకు ఉన్న రిలేషన్​ను ఎలా వర్ణించాలో, ఎక్కడ నుంచి ప్రారంభించాలో నాకు తెలియట్లేదు. మనం కలిసింది కొన్నిసార్లే అయినప్పటికీ ఎన్నో ఏళ్ల క్రితం నుంచి కలిసున్నట్లుగా అనిపిస్తోంది. ఏ విషయంలోనైనా సరే చాలా స్ట్రైట్​ ఫార్వడ్​గా ఉంటావు మహిళల కోసం ముందుకొస్తావు. నాకు ఎన్నో విషయాల్లో ఇన్​స్పిరేషన్​గా నిలుస్తుంటావు. నిన్ను ఫ్రెండ్ అనడం కంటే సోదరి అని పిలవడం నాకు ఎంతో ఇష్టం. జీవితంలో ఎదురైన ఎన్నో సవాళ్లను నువ్వు ఎంతో ధైర్యంగా ఎదుర్కొన్నావు. ఇటువంటి పోరాటాలు చేయడం నీకు మాత్రమే సాధ్యం. లైఫ్​ నీకు ఎన్ని ఛాలెంజెస్​ ఇచ్చినా కూడా రెట్టింపు బలంతో వాటిని ఎదుర్కొన్నావు. ఈ విషయంలో నిన్ను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంటుంది" అని ఓ వాయిస్‌ మెసేజ్​ను పంపారు. ఇదిలా ఉండగా, ఈ వాయిస్ మెసేజ్​పై స్పందించిన సమంత ఆమెకు ధన్యవాదాలు తెలిపారు.

'ఆమె వల్ల ఈ ఛాన్స్'
'బేబీ జాన్‌'తో బాలీవుడ్​లో అవకాశం రావడానికి కూడా సమంతనే కారణమని కీర్తి ఇటీవల చెప్పారు. తమిళ చిత్రం 'తెరి'కి రీమేక్‌గా ఇది రూపొందగా, ఆ సినిమాలో హీరోయిన్‌గా సామ్​ నటించారు. అయితే 'తెరి' రీమేక్ చేయాలని మేకర్స్‌ అనుకున్నప్పుడు వారికి కీర్తి పేరును సజెస్ట్ చేసింది సమంతానేనట. అలా తనకు 'బేబీ జాన్‌'లో అవకాశం వచ్చిందని కీర్తి తెలిపారు.

'మహానటి' సినిమాను ఫస్ట్ రిజెక్ట్ చేశా - ఆయన సపోర్ట్ వల్లే ఓకే చెప్పాను : కీర్తి సురేశ్​

'వాళ్లు సెకండ్‌ హ్యాండ్‌ అన్నారు - అయినా రివెంజ్ తీసుకోలేదు' - విడాకులపై సమంత

Last Updated : Jan 15, 2025, 5:17 PM IST

ABOUT THE AUTHOR

...view details