Karthika Deepam Vantalakka Remuneration :వంటలక్క ప్రేమి విశ్వనాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆరనీకుమా ఈ దీపం అంటూ బుల్లితెరపై పాట వినిపిస్తే చాలు కార్తీక దీపాన్ని చూసేందుకు అతుక్కుపోయేవారు ప్రేక్షకులు. అందులో వంటలక్క ఏడిస్తే ఏడ్చారు, నవ్వితే నవ్వారు, ఆమె కష్టసుఖాలను తమవిగా భావించి వెన్నంటే నిలిచారు. అయితే ఇప్పుడీ సీరియల్‌కు రెండో సీజన్‌గా కార్తీక దీపం నవవసంతం వస్తున్న సంగతి తెలిసిందే.
ఈ మధ్యే గ్రాండ్‌గా మొదలైందీ ధారావాహిక. ఇప్పుడీ రెండో సీజన్ కూడా సక్సెస్‌ఫుల్‌గానే రన్ అవుతోంది. తొలి సీజన్‌కు వచ్చిన క్రేజ్‌తో ప్రేమీ విశ్వనాథ్ రెండో సీజన్లోనూ ఛాన్స్ దక్కించుకుంది అలానే డాక్టర్ బాబు నిరూపమ్ కూడా అవకాశం అందుకున్నారు. అయితే మరోసారి ముందుగా అనుకున్నట్టే వంటలక్క, డాక్టర్ బాబు పాత్రలకు మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ క్రమంలోనే వంటలక్క ప్రేమీ విశ్వనాథ్ రెమ్యునరేషన్ గురించి ఓ వార్త బయటకు వచ్చింది. ఒక్క ఎపిసోడ్‌కు ఆమె ఎంత ఛార్జ్ చేస్తుందో కథనాలు కనపడుతున్నాయి.
ఒక్క రోజు సీరియల్‌లో నటించినందుకుగానూ దాదాపు రూ. 35 వేల రూపాయలు వరకు తీసుకుంటుందని అంటున్నారు. మొత్తంగా నెలకు రూ. 7 లేదా రూ.8 లక్షలు తీసుకుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతో తెలీదు కానీ ఇది తెలుసుకుంటున్న ఫ్యాన్స్ అన్ని లక్షలా అంటూ షాక్ అవుతున్నారు.