తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'కన్నప్ప' ఫైటర్ భామపై అందరి కళ్లు- ఈ ముద్దుగుమ్మ ఎవరంటే? - Kannappa Movie Heroine - KANNAPPA MOVIE HEROINE

Kannappa Movie Heroine: టాలీవుడ్ స్టార్ హీరో మంచు విష్ణు 'కన్నప్ప' సినిమా నుంచి రీసెంట్​గా రిలీజైన టీజర్​కు మంచి స్పందన వస్తోంది. అయితే ఈ టీజర్​లో ఫైట్లు చేస్తూ, తన అందంతో ఆకట్టుకున్న భామ ఎవరా అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఇంతకీ ఆమె ఎవరు? ఆమె గురించి టాలీవుడ్ ఏం చర్చించుకుంటుంది?

Kannappa Movie Heroine
Kannappa Movie Heroine (Source: ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jun 17, 2024, 4:57 PM IST

Kannappa Movie Heroine:మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న 'కన్నప్ప' టీజర్ ఇటీవల రిలీజై మంచి టాక్ అందుకుంది. ఈ టీజర్​ సినిమాపై టాలీవుడ్ ఆడియెన్స్​లో ఆసక్తి పెంచింది. కన్నప్ప అనగానే భక్తి సినిమా అనుకున్న ఆడియెన్స్ కాస్త, టీజర్లో యాక్షన్ అంశాలు చూసి షాక్ తిన్నారు. అయితే ఈ టీజర్​లో ఒకటి రెండు చోట్ల ఓ అందాల భామ నిపించింది. ఈమె నదిలో నుంచి అలా నడుచుకుంటూ వచ్చిన సీన్ కుర్రాళ్లను ఫిదా చేసింది. దీంతో ఆ ముద్దుగుమ్మ ఎవరా అని తెగ వెతికేశారు. మరి ఆ భామ ఎవరంటే?

నయనతార, కాజల్ అగర్వాల్​తోపాటు కన్నప్ప సినిమాలో ఒకరిద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు. అయితే ఈ టీజర్​లో అందర్నీ ఆకర్షించిన ముద్దుగుమ్మ పేరు 'ప్రీతి ముకుందన్'. ఈమె తమిళ సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్. రీసెంట్​గా రిలీజైన ఓం భీమ్ బుష్ సినిమాలోనూ నటించింది. కానీ, తాజాగా కన్నప్ప సినిమా టీజర్​తో ప్రీతి టాలీవుడ్​లో టాక్ ఆఫ్ ది టౌన్​గా మారింది.

ఇప్పటికే పలువురు దర్శక నిర్మాతలు ప్రీతి ముకుందన్ గురించి ఆరా తీయడం మొదలుపెట్టారంట. ఇదే కొనసాగితే 'కన్నప్ప' విడుదలకు ముందే ప్రీతికి తెలుగులో మరిన్ని అవకాశాలు వస్తాయని ఇండస్ట్రీలో అనుకుంటున్నారు. అయితే అలా అని ప్రీతి వెండితెరకు కొత్తేమి కాదు. తమిళనాడుకు చెందిన ప్రీతి ఇప్పటికే పలు తమిళ చిత్రాల్లో నటించింది. కానీ ఇంకా అక్కడ సరైన బ్రేక్ రాలేదు. కన్నప్పతో తెలుగులో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీలో మంచు విష్ణుతో పాటు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, రెబల్ స్టార్ ప్రభాస్ కనిపించనున్నారు. తిన్నడు అనే దొంగ భక్త కన్నప్పగా ఎలా మారాడు అనేదే ఈ చిత్ర కథాంశం. ఈ సినిమాను దర్శకుడు ముకేశ్ కుమార్ తెరకెక్కిస్తున్నారు. విష్ణు డ్రీమ్​ ప్రాజెక్ట్ అయిన కన్నప్పలో భారీ తారాగణం నటిస్తోంది. మలయాళ నటుడు మోహన్ లాల్, సీనియర్ నటుడు శరత్ కుమార్, మధుబాల తదితరులు ఆయా పాత్రల్లో కనిపించనున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్ బ్యానర్​పై కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స్టీఫెన్ దేవస్సి సంగీత దర్శకుడుగా బాధ్యతలు చేపట్టారు.

'కన్నప్ప' టీజర్ ఔట్- ప్రభాస్ ఎంట్రీ అదుర్స్- వీడియో చూశారా? - Kannappa Teaser

కేన్స్​లో 'కన్నప్ప' - టీజర్ లాంఛ్​కు మేకర్స్ భారీ ప్లాన్స్​ - Kannappa Movie

ABOUT THE AUTHOR

...view details