Kanguva Suriya Rolex : యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన చిత్రం విక్రమ్ 2022లో రిలీజై భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సూర్య నటించిన రోలెక్స్ పాత్ర కూడా బాగా క్లిక్ అయింది. ఇంకా చెప్పాలంటే ప్రత్యేకమైన ఫ్యాన్స్ బేస్‌ను సంపాదించుకుంది. మాదకద్రవ్యాల గ్యాంగ్‌లీడర్‌గా సినిమా క్లైమాక్స్‌లో ఆయన పండించిన విలనిజంకు ప్రేక్షకులు స్టన్ అయిపోయారు.
అయితే రోలెక్స్ పాత్ర ఆధారంగా ఒక ఫుల్ పక్కా యాక్షన్ మోడ్ సినిమాను తెరకెక్కిస్తానని లోకేశ్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. తాజాగా దీనిపై కంగువా ప్రమోషన్స్‌లో సూర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 1986లో రిలీజైన విక్రమ్‌తో 2022లో విడుదలైన విక్రమ్‌కు ఎలా అయితే లింక్ పెట్టారో అలానే రోలెక్స్‌కూ తన గత సినిమాకు లింక్ ఉంటుందని వెల్లడించారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఆ సినిమా ఏమై ఉంటుందా? అని పలువురు నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు.
కాగా, సూర్య నటించిన లేటెస్ట్ మూవీ కంగువా. శివ దర్శకత్వం వహించారు. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించాయి. సినిమాలో సూర్య మూడు భిన్న లుక్స్‌లో కనిపించనున్నారు. దిశా పటానీ హీరోయిన్గా నటించింది. బాబీ దేవోల్ విలన్ పాత్ర పోషించారు. పీరియాడిక్ యాక్షన్ జానర్‌లో ఓ కొత్త కాన్సెప్ట్‌లో దీనిని తెరకెక్కించినట్లు మూవీ టీమ్ చెబుతోంది. నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. దాదాపు రూ.2000 కోట్లు వసూలు చేస్తుందని నిర్మాత విశ్వసం వ్యక్తం చేశారు.