Rajamouli Baahubali 3: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టింది. ప్రభాస్ కూడా ఈ చిత్రంతోనే స్టార్ హీరోగా ఎదిగారు. అయితే ఈ చిత్రం రెండు భాగాలుగా వచ్చి భారీ విజయంతో పాటు కలెక్షన్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే.
దీంతో బాహుబలి 3కి అప్పట్లో అభిమానులు, సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూశారు. కానీ దర్శకుడు రాజమౌళి మాత్రం అనంతరం ఆర్ఆర్ఆర్, ఇప్పుడు SSSMB 29తో బిజీ అయిపోయారు. అయినప్పటికీ బాహుబలి 3 ఉంటుందని మాత్రం క్లారిటీ ఇచ్చారు. కానీ ఎప్పుడో చెప్పలేదు.
అయితే తాజాగా మరోసారి బాహుబలి 3 చర్చ తెరపైకి వచ్చింది. కోలీవుడ్ నిర్మాత(ప్రస్తుతం కంగువా సినిమాకు) కేఈ జ్ఞానవేల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ మూడో భాగంపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. బాహుబలి రెండు భాగాలకు తమిళంలో నిర్మాతగా జ్ఞానవేలే వ్యవహరించారు.
ప్రస్తుతం కంగువా ప్రమోషన్స్‌లో(Kanguva Promotions) భాగంగా ఆయన మాట్లాడుతూ ‘గతవారమే బాహుబలి మేకర్స్‌తో చర్చించాను. మూడో భాగం ప్లాన్ చేసే పనిలో ఉన్నారు. దాని కన్నా ముందు రెండు సినిమాలు ఉన్నాయి. అని చెప్పుకొచ్చారు. దీంతో ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బాహుబలి - 3 కోసం వెయిటింగ్ అంటూ ప్రభాస్ అభిమానులు తెగ పోస్టులు పెడుతున్నారు.