తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'మీరు ఓ అరుదైన రత్నం - ఇలాగే అద్భుతాలు సృష్టించాలి' - కమల్​కు శ్రుతి స్పెషల్ విషెస్! - KAMAL HAASAN BIRTHDAY

'మీరు ఓ అరుదైన రత్నం' : కమల్​కు కుమార్తె స్పెషల్ విషెస్!

Kamal Haasan Birthday Wishes
Kamal Haasan Birthday Wishes (ETV Bharat, Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Nov 7, 2024, 2:06 PM IST

Kamal Haasan Birthday Wishes : లోకనాయకుడు కమల్‌ హాసన్‌ బర్త్​డే సందర్భంగా ఆయన కుమార్తె శ్రుతి హాసన్‌ సోషల్ మీడియా వేదికగా ఓ స్పెషల్ పోస్ట్ షేర్ చేశారు. ఈ సందర్భంగా ఆయనతో దిగిన ఓ పాత ఫొటోను ఆ పోస్ట్​లో పంచుకున్నారు.

"హృదయపూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు అప్పా. మీరు ఈ ప్రపంచంలోనే ఓ అరుదైన రత్నం. మీ కుమార్తెగా పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మీ పక్కన నడవడం నాకు ఇష్టమైన పనుల్లో ఒకటి. మీరు దేవుడిని నమ్మరని నాకు తెలుసు. కానీ, మీపై ఎల్లప్పుడూ ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీరు ఇలానే ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండాలనుకుంటున్నాను. ఇలానే మీరు అద్భుతాలు సృష్టిస్తుండాలి. మరెన్నో పుట్టిన రోజులు చేసుకోవాలి. మీ కలలన్నీ నిజమవ్వాలి. లవ్‌ యూ నాన్న" అంటూ కమల్‌పై తనకున్న ప్రేమను స్టోరీ రూపంలో వ్యక్త పరిచారు శ్రుతి హాసన్‌.

"అద్భుతాలకు నిదర్శనంగా నిలిచే వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఎంతోమందికి ఇన్​స్పిరేషన్. మీరంటే నాకెంతో ప్రేమ, గౌరవం. మీరు మరెన్నో విజయాలు అందుకోవాలని నేను కోరుకుంటున్నాను" - కోలీవుడ్ డైరెక్టర్ లోకేశ్‌ కనగరాజ్‌

"పుట్టినరోజు శుభాకాంక్షలు కమల్‌ హాసన్‌. ఈ ఏడాది కూడా మీరు గొప్ప విజయాలను అందుకోవాలని నేను కోరుకుంటున్నా"- మలయాళ స్టార్ హీరో మోహన్‌ లాల్‌

ఆసక్తికరంగా 'థగ్​ లైఫ్' టీజర్
మరోవైపు కమల్ బర్త్​డే సందర్భంగా అభిమానులు, సెలబ్రిటీలతో పాటు పలు నిర్మాణ సంస్థలు ఆయనకు స్పెషల్ విషెస్ తెలుపుతున్నాయి. ఈ క్రమంలో ఆయన అప్​కమింగ్ మూవీస్​కు సంబంధించిన అప్‌డేట్స్ పంచుకున్నాయి. ప్రస్తుతం కమల్​, మణిరత్నం తెరకెక్కిస్తున్న 'థగ్‌ లైఫ్‌'లో నటిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్​లో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్‌ 5న విడుదల కానుంది. తాజాగా దీనికి సంబంధించిన టీజర్​ను విడుదల చేయగా, అది సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. అందులోని కమల్ లుక్స్​ డిఫరెంట్​ లుక్స్​ను అభిమానులు నెట్టింట వైరల్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాతో ఆయన శంకర్ తెరకెక్కిస్తున్న 'ఇండియన్‌ 3'లోనూ నటిస్తున్నారు.

కమల్ హాసన్ బర్త్​డే స్పెషల్ - 'థగ్​ లైఫ్' టీజర్ చూశారా?

'ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు- అందుకే ఆ అమితాబ్​ సినిమా అంటే నాకిష్టం లేదు' - కమల్ హాసన్

ABOUT THE AUTHOR

...view details