తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

విక్రమ్ బాటలో 'భారతీయుడు' - లోకేశ్ ఫార్ములా సక్సెస్ అవుతుందా? - Bharateeyudu 2 Movie - BHARATEEYUDU 2 MOVIE

Kamal Haasan Bharateeyudu 2 Movie : కమల్​ హాసన్ కీలక పాత్రలో రూపొందిన 'భారతీయుడు 2' సినిమా కోసం ఓ స్పెషల్ ఫార్ములాను ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. కమల్​ రోల్​కు సంబంధించిన ఈ వార్త నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. అదేంటంటే?

Kamal Haasan Bharateeyudu 2 Movie
Kamal Haasan Bharateeyudu 2 Movie (ETV Bharat Archives)

By ETV Bharat Telugu Team

Published : Jun 2, 2024, 10:22 AM IST

Kamal Haasan Bharateeyudu 2 Movie : సాధారణంగా బడా స్టార్స్ ఉన్న సినిమాల్లో వాళ్లకు స్క్రీన్​ టైమ్ ఎక్కువ ఇవ్వాలని అభిమానులు ఆశిస్తుంటారు. ఇక డైరెక్టర్లు కూడా ఫ్యాన్స్​ను నిరాశపరచకుండా కథకు తగ్గట్లుగా హీరోను ఎక్కువ టైమ్ చూపించేందుకు ప్రాధాన్యత ఇస్తుంటారు. కానీ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్​ కనగరాజ్ మాత్రం అందుకు భిన్నంగా ఓ ఎక్స్​పెరిమెంట్​ చేసి సక్సెస్ అయ్యారు.

లోకనాయకుడు కమల్​ హాసన్​, లోకేశ్ కనగరాజ్ కాంబోలో తెరకెక్కిన బ్లాక్​బస్టర్​ మూవీ 'విక్రమ్​'. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ టాక్ అందుకోవడమే కాకుండా లోకేశ్​ సినిమాటిక్ యూనివర్స్​కు మరింత క్రేజ్ పెరిగింది. అంతే కాకుండా కమల్​తో పాటు ఫహాద్ ఫాజిల్, సూర్య, విజయ్ సేతుపతి యాక్టింగ్​కు ఫ్యాన్స్​ నుంచి ఓ రేంజ్​లో రెస్పాన్స్ వచ్చింది.

అయితే ఇందులో కమల్ పాత్ర కేవలం 47 నిమిషాలే ఉంటుందని స్వయంగా ఆయనే చెప్పేదాక, కొంతమంది ఫ్యాన్స్ పసిగట్టే దాకా ప్రేక్షకులు ఈ విషయాన్ని ప్రేక్షకులు కనిపెట్టలేకపోయారు. లోకేశ్ చేసిన స్క్రీన్ ప్లే మేజికే ఇందుకు కారణం. కమల్ కంటే ఫహాదే ఎక్కువ నిడివిలో కనిపించాడు కానీ అందరి దృష్టిని మాత్రం కమల్ ఆకర్షించారు.

ఇప్పుడు భారతీయుడు 2 విషయంలోనూ అదే రిపీట్ అవ్వనుందని సమాచారం. ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన సిద్దార్థ్ తాజాగా దీనికి సంబంధించిన ఓ హింట్ ఇచ్చి ఈ చిత్రంపై మరింత అంతనాలు పెంచారు.

సిద్ధార్థ్ చెప్పినదాని ప్రకారం ప్రకారం సేనాపతి (కమల్ హాసన్) విదేశాల్లో ఉన్న సమయంలో భారత్​లో అవినీతి రాజకీయాల పట్ల ఒక యువకుడు (సిద్ధార్థ్) పోరాటం చేస్తున్నాడని తెలుసుకుంటారు. అయితే అతడి ప్రాణాలకి హాని ఉంది అని తెలుసుకున్న సేనాపతి, తనని రక్షించేందుకు తిరిగి భారత్​కు వస్తారట. అలా ఈ సినిమాలో సిద్ధార్థ్​దే ఎక్కువ స్క్రీన్ టైమ్ ఉంటుందని సమాచారం.

మరోవైపు విక్రమ్ కన్నా ఈ సినిమాలో సేనాపతికి తక్కువ టైమ్ ఉందో లేదో తెలీదు కానీ డైరెక్టర్ శంకర్ మాత్రం కమల్ ఇంట్రోను చాలా ఆలస్యంగా చూపించనున్నట్లు సమచారం. దీని బట్టి చూస్తుంటే ఇందూలోనూ కమల్ తన నటనతో మరోసారి అదరగొట్టనున్నారని తెలుస్తోంది.

'భారతీయుడు -2' రిలీజ్ డేట్ కన్ఫార్మ్- 'మరి గేమ్​ఛేంజర్ సంగతేంటి'? - Bharateeyudu 2 release

రూ. 75 కోట్లకు అమ్ముడుపోయిన 'గేమ్ ఛేంజర్' నార్త్ రైట్స్! - మరి భారతీయుడు 2 ? - Game Changer Movie North Rights

ABOUT THE AUTHOR

...view details