NKR21 Vijayashanthi Birthday Glimpse :టాలీవుడ్ స్క్రీన్‌పై లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో విజయాలు అందుకున్న నటి విజయశాంతి. హీరోలకు దీటుగా యాక్షన్ ఎపిసోడ్స్‌లో నటించి సంచలనం సృష్టించారు. లేడీ అమితాబ్, లేడీ సూపర్ స్టార్‌గా పేరు సంపాదించుకున్నారు. అయితే ఆమె నటించిన పలు హిట్ చిత్రాల్లో కర్త్యవం కూడా ఒకటి. తెలుగు తెరపై ఒక చరిత్ర సృష్టించిన ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ వైజయంతిగా నటించి విజయశాంతి సూపర్ స్టార్ అయ్యారు. అప్పటి వరకు పోలీసు పాత్రలో ఇతర ఏ నటి కూడా అంత పవర్ ఫుల్‌గా నటించలేదు. కానీ విజయశాంతి మాత్రం నటించి సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఆ సినిమా అప్పట్లో ప్రేక్షకులపై చాలా ప్రభావం చూపించింది. ఎందరికో స్ఫూర్తిని కూడా ఇచ్చింది.
అయితే ఇప్పుడు చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ విజయశాంతి పోలీస్ ఆఫీసర్ వైజయంతిగా కనపడనున్నారు. అది నందమూరి కల్యాణ్‌రామ్ చిత్రం కోసం. డెవిల్ సక్సెస్ తర్వాత నందమూరి కల్యాణ్‌రామ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ NKR21. యాక్షన్ జానర్‌లో రానున్న ఈ చిత్రంతో ప్రదీప్ చిలుకూరి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అయితే నేడు(జూన్ 24) విజయశాంతి పుట్టినరోజు సందర్భంగా మూవీ నుంచి రాములమ్మ ఫస్ట్ లుక్‌తో పాటు స్పెషల్ అండ్ పవర్ఫుల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్.