Kalki Movie Update:రెబల్ స్టార్ ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో 'కల్కి 2898 AD' తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఇటలీలో జరుగుతున్నట్లు తెలుస్తోంది. సినిమాను 2024 మే 9న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించిన నేపథ్యంలో ప్రభాస్ ఫ్యాన్స్ సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
అయితే ఏదైన పండగ వచ్చిందంటే టాలీవుడ్లో మేకర్స్ మూవీ అప్డేట్స్ ఇస్తుంటారు. కాగా, 'కల్కి' రిలీజ్‌కు మరో రెండు నెలల సమయం మాత్రమే ఉంది. దీంతో శుక్రవారం (మహా శివరాత్రి) కల్కి నుంచి ఏదైనా అప్డేట్ ఉండవచ్చని డార్లింగ్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అయితే మూవీటీమ్ ప్రస్తుతం విదేశాల్లో షూటింగ్ పనుల్లో బిజీగా ఉంది. ఈ క్రమంలో రేపు అప్డేట్స్ వచ్చే ఛాన్స్‌లు తక్కువగానే ఉన్నాయి.
ఇక మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న 'కన్నప్ప' నుంచి శివరాత్రి సందర్భంగా ఓ అప్డేట్ ఉంటుందని మేకర్స్ ఇప్పటికే తెలిపారు. అయితే ఈ సినిమాలో పాన్ఇండియా స్టార్ ప్రభాస్ శివుడి పాత్రలో నటిస్తున్నారు. దీంతో శివరాత్రి రోజు ప్రభాస్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయవచ్చని ఇన్సైట్ టాక్. ఒకవేళ అదే నిజమైతే 'కల్కి' నుంచి అప్డేట్ రాకున్నా 'కన్నప్ప' శివుడి పాత్ర పోషిస్తున్న ప్రభాస్ లుక్ రిలీజైనా డార్లింగ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవీ- విశిష్ఠ కాంబోలో రానున్న 'విశ్వంభర'లోనూ కాస్త డివోషనల్ టచ్ ఉండేలా కనిపిస్తోంది. ఈ సినిమా నుంచి ఇప్పటిదాకా పోస్టర్, రిలీజ్ డేట్ తప్ప మరో అప్డేట్ లేదు.