తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'కల్కి' విషయంలో బాంబ్ పేల్చిన కమల్ హాసన్ - ఇలా షాకిచ్చారేంటి? - Kalki 2898 Ad kamal Haasan

Kalki 2898 Ad kamal Haasan : యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ - ప్రభాస్ ఫ్యాన్స్​కు షాక్ ఇచ్చారు. కల్కి సినిమాలో తన పాత్ర గురించి చెప్పి బాంబు పేల్చారు. ఆ వివరాలు.

'కల్కి' విషయంలో బాంబ్ పేల్చిన కమల్ హాసన్  - ఇలా షాకిచ్చారంటే?
'కల్కి' విషయంలో బాంబ్ పేల్చిన కమల్ హాసన్ - ఇలా షాకిచ్చారంటే?

By ETV Bharat Telugu Team

Published : Mar 25, 2024, 11:01 AM IST

Updated : Mar 25, 2024, 11:47 AM IST

Kalki 2898 Ad kamal Haasan :మహానటి మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్షన్​లో భారీ బడ్జెట్​తో తెరకెక్కుతున్న కల్కి మూవీ అప్​డేట్స్​ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో యంగ్ రెబల్ స్టార్, పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటిస్తుండగా ఆయనకు జోడీగా దీపిక పదుకుణె చేస్తున్నారు. బిగ్ బీ అమితాబ్ బచ్చన్, దిశా పటానీ కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ మూవీలో విలన్​గా కమల్ హాసన్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. కమల్ హాసన్ ఈ చిత్రంలో నటిస్తుండటం కల్కిపై మరింత బజ్ పెరిగేలా చేసింది. అయితే తాజాగా కమల్ హాసన్ ఇచ్చిన ఓ ట్విస్ట్ ప్రభాస్​ అభిమానులను కలవరానికి గురి చేసింది.

ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కల్కి, థగ్ లైఫ్, ఇండియన్ 2 సినిమాల షూటింగ్ గురించి ఆయన అప్డేట్స్ ఇచ్చారు. మంచి సినిమాను అందించడం కోసం తాను చిత్రయూనిట్ ఎప్పుడూ తాపత్రాయపడుతుంటామని తెలిపారు. ఆలస్యమైనప్పటికీ కథ, క్వాలిటీ విషయంలో అస్సలు రాజీపడబోమని చెప్పారు. ఇండియన్ 2, ఇండియన్ 3 రెండింటి షూటింగ్ పూర్తి చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ఇండియన్ 2 పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందన్నారు. అది కంప్లీట్ అయ్యాక దాని సీక్వెల్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభిస్తామని కమల్ తెలిపారు. ఎన్నికల హడావిడి పూర్తయ్యాక మణిరత్నం థగ్ లైఫ్ సినిమా చిత్రీకరణ షురూ చేస్తామన్నారు.

అయితే కల్కీ మూవీ గురించి షాకింగ్ అప్డేట్​ ఇచ్చారు కమల్. తాను కల్కిలో గెస్ట్ రోల్​లో నటిస్తున్నట్లు చెప్పారు. తనకు సంబంధించి షూటింగ్ కంప్లీట్ అయినట్లు చెప్పారు. అయితే కమల్ పాత్ర ఇలా గెస్ట్ అనేది ఎవరూ ఊహించలేదు. ఎందుకంటే ఆయన గతంలో ఈ మూవీలో విలన్​గా నటిస్తున్నారని ప్రచారం సాగింది. కానీ కమల్ హాసన్ సడెన్​గా ఇలా గెస్ట్ రోల్ చేస్తున్నట్లు చెప్పడం అభిమానలకు మింగుడుపడటం లేదు. కానీ ఆయన పాత్రను డైరెక్టర్ నాగ్ అశ్విన్ చాలా చక్కగా డిజైన్ చేశారని తెలుస్తోంది.

వీటితో పాటు శ్రుతిహాసన్, దర్శకుడు లోకేశ్ కనగరాజ్​ల స్పెషల్ సాంగ్​కు కమల్ వర్క్ చేసిన విషయం తెలిసిందే. ఇనిమేల్ అంటూ సాగే ఈ పాటకు లిరిక్స్ అందించారు. ద్వారకేశ్ ప్రభాకర్ డైరెక్షన్​లో వచ్చిన ఈ పాట మార్చి 25న రిలీజ్ కానుంది. అంతేకాదు ధనుశ్​ హీరోగా తెరకెక్కబోతున్న ఇళయరాజా బయోపిక్​లోనూ కమల్ భాగం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Last Updated : Mar 25, 2024, 11:47 AM IST

ABOUT THE AUTHOR

...view details