జపనీస్‌లో మాట్లాడిన ప్రభాస్ - ఫ్యాన్స్‌కు సారీ చెబుతూ వీడియో రిలీజ్ - KALKI 2898 AD JAPAN RELEASE
అభిమానులకు క్షమాపణలు చెప్పిన రెబల్ స్టార్ ప్రభాస్ - ఎందుకంటే?
Published : 7 hours ago
Kalki Japan Release : కల్కి 2898 ఏడీ - ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ ముందు రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడీ సినిమా జపాన్‌లో 2025 జనవరి 3న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు ప్రభాస్. తాను అక్కడికి రాలేకపోతున్నానంటూ ఫ్యాన్స్‌కు ప్రభాస్ క్షమాపణలు చెప్పారు. కొత్త సినిమా షూటింగ్‌లో కాలికి స్వల్ప గాయమవ్వడం వల్ల ప్రస్తుతానికి రాలేకపోతున్నానని, త్వరలోనే కలుస్తానని ఫ్యాన్స్‌కు చెప్పారు. తాను ప్రస్తుతం బాగానే ఉన్నానని అన్నారు. అయితే ప్రభాస్ 'కల్కి'ని ఎంజాయ్ చేయండంటూ జపనీస్‌లో మాట్లాడటం విశేష.