Kalki 2898 AD Allu Arjun Review :పాన్ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన 'కల్కి 2898 AD' బాక్సాఫీస్ వద్ద దూసుకెళుతోంది. దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పందించారు. ఈ సినిమా ఓ విజువల స్పెక్టాకల్ అంటూ ఆకాశానికెత్తేశారు. మన భారతీయ చరిత్రను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఇలా తీయడం అద్భుతం అంటూ ప్రశంసించారు. కల్కి మూవీలో ప్రతి ఫ్రేమ్ ఒక వండర్‌లా ఉందంటూ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు.
'ఇది సార్ ఇండియన్ సినిమా బ్రాండ్!'
'కల్కి టీమ్‌కు అభినందనలు. ఈ సినిమా ఓ విజువల్ స్పెక్టకిల్. సూపర్ హీరో పాత్రలో మిత్రుడు ప్రభాస్ అదరగొట్టేశారు. అమితాబ్ జీ మీరు నిజంగా మా అందరికీ ఇన్‌స్పిరేషన్. మీ గురించి చెప్పడానికి మాటల్లేవ్. కమల్ హాసన్ సార్, మిమ్మల్ని తరువాతి పార్ట్‌లో చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఈ సినిమాలో దీపిక పదుకొణె స్టన్నింగ్ పెర్ఫామెన్స్ చేసింది. దిశా పటానీ తెరపై ఆకర్షణీయంగా కనిపించావు. అలాగే ఈ సినిమాలో పనిచేసిన మిగతా నటీనటులకి, టెక్నికల్ టీమ్‌కి మరీ ముఖ్యంగా సినిమాటోగ్రఫీ, ఆర్ట్, కాస్ట్యూమ్స్, ఎడిట్, మేకప్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వారికి నా అభినందనలు. భారతీయ సినిమా స్థాయిని పెంచేందుకు ఇంత రిస్క్ తీసుకొని చిత్రాన్ని నిర్మించిన వైజయంతీ ఫిలిమ్స్ అధినేత అశ్వినీదత్, స్వప్న దత్, ప్రియాంక దత్‌కు సెల్యూట్. ఫైనల్‌గా ప్రేక్షకులతో వావ్ అనిపించిన కెప్టెన్ నాగ్ అశ్విన్, నిజంగా ఈ జనరేషన్‌కు ఓ పాత్ బ్రేకింగ్ డైరెక్టర్. చివరకు భారతీయ సంస్కృతి సంప్రదాయాలతో వచ్చిన సినిమా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో మ్యాచ్ చేసింది." అంటూ అల్లు అర్జున్ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు.