A Farmer Growing Black Chilli : సాధారణంగా మిరప అనగానే అందరికీ గుర్తొచ్చేది ఆకు పచ్చ, ఎరుపు మిరపకాయలే. కానీ ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక పరిధి బుర్రిలంకలో నల్ల పచ్చి మిరప కాయలతో ఉన్న ఓ మొక్క అందరినీ అబ్బురపరుస్తోంది. స్థానికుడైన మలసాని గోవింద రాజుకు రెండు నెలల క్రితం ప్రకాశం జిల్లాకు చెందిన ఆయన స్నేహితుడు ఈ మొక్కను ఇచ్చారు.
ప్రస్తుతం ఈ మొక్కకు సుమారు 40 వరకు నల్ల మిరపకాయలు కాశాయి. ఈ మొక్క చిట్టి మిరప జాతికి చెందిందని, సాధారణ దేశవాళీ పచ్చిమిర్చితో పోలిస్తే ఘాటుగా ఉంటుందని మండల ఉద్యాన శాఖ అధికారి సుధీర్ కుమార్ చెప్పారు. వీటిలో ఎరుపు, నలుపు, తెలుపు రంగుల కలయిక ఉంటుందని వివరించారు.