తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ప్రీ రిలీజ్ రద్దు బాధాకరం - కానీ సినిమా చూసి కాలర్ ఎగరేస్తారు! - Devara Pre Release - DEVARA PRE RELEASE

Jr NTR On Devara Pre Release : 'దేవర పార్ట్ 1' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అనూహ్యంగా రద్దైంది. దీంతో ఫ్యాన్స్​ను ఉద్దేశించి హీరో ఎన్టీఆర్ ఓ వీడియో రిలీజ్ చేశారు.

Devara Pre Release
Devara Pre Release (Source : ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Sep 22, 2024, 10:42 PM IST

Updated : Sep 22, 2024, 10:58 PM IST

Jr NTR On Devara Pre Release :గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ లీడ్​ రోల్​లో నటించిన 'దేవర పార్ట్ 1' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అనూహ్యంగా రద్దైంది. హైదరాబాద్​ నోవాటెల్​లో ఆదివారం సాయంత్రం ఈ ఈవెంట్ జరగాల్సి ఉండగా, అంచనాకు మించి అభిమానులు రావడం వల్ల నిర్వాహకులు కార్యక్రమాన్ని రద్దు చేశారు. దీంతో తీవ్ర నిరుత్సాహంతో అభిమానులు వెనుదిరిగారు. అయితే దీనిపై హీరో ఎన్టీఆర్ స్పందించారు. సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్​ను ఉద్దేశించి ఓ వీడియో రిలీజ్ చేశారు.

'అభిమాన సోదరులకు నమస్కారం. ఈరోజు దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడం బాధాకరం. ముఖ్యంగా నాకు ఎక్కువ బాధగా ఉంది. అవకాశం దొరికినప్పుడల్లా మీతో (ఫ్యాన్స్​) సమయం గడపాలని ఉంటుంది. దేవర సినిమా గురించి, ఈ చిత్రం కోసం పడ్డ కష్టం గురించి అందరికీ వివరిద్దామని అనుకున్నా. కానీ, భద్రతా కారణాల వల్ల ఈవెంట్ క్యాన్సిల్ అయ్యింది. మళ్లీ చెప్తున్నా మీకంటే నాకు ఎక్కవ బాధగా ఉంది. మేకర్స్​, ఈవెంట్ ఆర్గనైజర్స్ వైఫల్యం వల్లే ఇలా జరగిందనడం తప్పు అనేది నా అభిప్రాయం. మీ ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటా. ఇవాళ కలవడం కుదరకపోయినా, సెప్టెంబర్ 27న మనమందరం కలుస్తున్నాం. దేవర చిత్రాన్ని అందరూ చూడబోతున్నారు. మీరు కాలర్ ఎగరేసుకునేలా ఈ సినిమా ఉంటుంది. సినిమా కోసం శివ చాలా కష్టపడ్డారు. మీ ప్రేమ, ఆశీర్వాదం మాకు ఉండాలి. అందరూ జాగ్రత్తగా వెళ్లారని ఆశీస్తున్నా' అని ఎన్టీఆర్ వీడియోలో పేర్కొన్నారు.

కాగా, కొరటాల శివ ఈ సినిమాను రెండు పార్ట్​లుగా తెరకెక్కించారు. అందులో భాగంగా సెప్టెంబర్ 27న గ్రాండ్​గా థియేటర్లలో రానుంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్​గా నటించింది. బాలీవుడ్ సీనియర్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్​ పాత్రలో నటించారు. సీనియర్ నటులు శ్రీకాంత్, శ్రుతి మారాఠే, చైత్ర రాయ్, షైన్ టామ్, మురళీ శర్మ, ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ తదితరులు నటించారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీంతం అందించగా, రత్నవేలు డీఓపీ బాధ్యతలు చూశారు. ఎన్​టీఆర్, యువసుధ బ్యానర్లపై ఈ సినిమా రూపొందింది.

భయమంటే ఏంటో తెలియాలంటే 'దేవర' కథ వినాలి! - ఇంట్రెస్టింగ్​గా రిలీజ్ ట్రైలర్! - Devara Release Trailer

నార్త్​ అమెరికాలో 'దేవర' విధ్వంసం! - వారంలోనే ఆ హిట్ మూవీ రికార్డును బ్రేక్​ చేసేందుకు రెడీ! - Jr NTR Devara Movie

Last Updated : Sep 22, 2024, 10:58 PM IST

ABOUT THE AUTHOR

...view details