NTR Remuneration : 'ఆర్‌ఆర్‌ఆర్'తో గ్లోబల్ వైడ్ స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ప్రస్తుతం భారీ బడ్జెట్ 'దేవర' చిత్రంలో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తొలి రెమ్యునరేషన్ ఎంత, ఇప్పుడు ఎంత ఛార్జ్ చేస్తున్నారు? సహా పలు విషయాలను తెలుసుకుందాం. వివరాళ్లోకి వెళితే. తారక్ సీనియర్ ఎన్టీఆర్ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నాడనడంలో ఎటువంటి సందేహం లేదు. రౌద్రం, వీరం, బీభత్సం, శాంతం, కరుణ, హాస్యం ఇలా నవరసాలను అలవోకగా పండించగలుగుతారు. సింగిల్ టేక్‌లోనే భారీ సంభాషణలు చెప్పడం సహా అదిరిపోయే రేంజ్లో స్టెప్పులు వేయడం ఆయన టాలెంట్. సింగర్‌గానూ మెప్పించారు. అప్పుడప్పుడు పలు చిత్రాల్లో పాటలు కూడా పాడారు. మొత్తంగా ఇలా అన్నింటిలోనూ తనకు తానే సాటి అని మేటి అనిపించుకున్నారు.
NTR : తొలి సినిమాకు రూ.4 లక్షలు రెమ్యునరేషన్ - 'దేవర'కు ఎన్ని కోట్లంటే? - జూనియర్ ఎన్టీఆర్ తొలి రెమ్యునరేషన్
NTR Remuneration : ప్రస్తుతం ఎన్టీఆర్ 'దేవర' సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి తారక్ రెమ్యునరేషన్ ఎంతంటే?
Published : Feb 1, 2024, 7:53 PM IST
హీరోగా కెరీర్ : 2001లో 'నిన్నుచూడాలని' చిత్రంతో హీరోగా సిల్వర్ స్క్రీన్కు పరిచయమైన యంగ్ టైగర్ ఆ తర్వాత వచ్చిన 'స్టూడెంట్ నెం.1', 'ఆది'తో స్టార్ హీరోగా మారిపోయారు. చిన్న వయసులోనే ఏ హీరో అందుకోని రేంజ్లో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుని ఫ్యాన్స్ ఫాలోయింగ్‌ను పెంచుకున్నారు. అనంతరం సింహాద్రి, రాఖీ, యమదొంగ, అదుర్స్, బృందావనం సహా రీసెంట్ ఆర్‌ఆర్‌ఆర్ వరకు ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లను ఖాతాలో వేసుకున్నారు. అయితే ఒకానొక సమయంలో శక్తి, ఊసరవళ్లి, దమ్ము, బాద్షా, రామయ్యా వస్తావ్యా, రభస వంటి వరుస ఫ్లాపులను కూడా అందుకున్నారు. కానీ ఆత్మస్థైరాన్ని కోల్పోలేదు. ఆ తర్వాత మళ్లీ టెంపర్‌తో ఫామ్‌లోకి వచ్చి టాప్ పొజిషన్‌కి వెళ్లిపోయారు.
రెమ్యునరేషన్ ఎంతంటే : అయితే ప్రస్తుతం ఒక్కో సినిమాకు ఎన్టీఆర్ సుమారు రూ. 50 నుంచి రూ.60 కోట్ల వరకు తీసుకుంటున్నారని బయట కథనాలు ఉన్నాయి. ప్రస్తుతం దేవరకు రూ.60 కోట్ల వరకు అందుకుంటున్నారట. అయితే తారక్ అందుకున్న మొదటి రెమ్యునరేషన్ నాలుగు లక్షల రూపాయలట. అప్పట్లో అంత మొత్తంలో డబ్బు చూసి తనకు ఏం చేయాలో తెలియక చాలా రోజుల వరకు ఆ డబ్బును లెక్క పెడుతూ ఉన్నారట. ఇప్పుడేమో కోట్లకు పైగా రెమ్యునరేషన్‌ను అందుకుంటున్నారు.