Jr NTR Fan Moment :మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్‌కు ఇండియాలోనే కాదు ఫారిన్‌లోనూ సూపర్ క్రేజ్ ఉంది. ముఖ్యంగా జపాన్‌లో ఆయనకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఎంతలా ఉంటే తాజాగా ఓ మహిళా అభిమాని తారక్‌ను చూసేందుకు పెద్ద సాహసమే చేసింది. లాస్ ఏంజిల్స్ వేదికగా జరిగిన బియాండ్ ఫెస్ట్‌లో ఆయన పాల్గొంటున్నారని తెలిసి, ఆమె టోక్యో నుంచి జర్నీ చేసి వేడుకకు చేరుకుంది. అక్కడ తారక్‌ను కలిసి మాట్లాడింది. ఆయన్ను చూసేందుకు ఎంతోమంది అభిమానులు జపాన్‌లో ఎదురుచూస్తున్నారని, తమ దేశానికి తప్పకుండా రావాలంటూ ఎన్టీఆర్‌ను ఆహ్వానించింది.
ఇక ఫ్యాన్ మాటలకు ఎన్టీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. తాను అక్కడి తప్పకుండా వస్తానంటూ ఆ అభిమానికి మాటిచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. అయితే ఈ వీడియోపై సదురు అభిమాని కూడా స్పందించారు. "అభిమానులతో కలిసి 'దేవర' చూసేందుకు తాను జపాన్ వస్తానని తారక్ మాటిచ్చారు. ఆయన చాలా గొప్ప మనసు ఉన్న వ్యక్తి. ఫ్యాన్స్‌పై ఎంతో ప్రేమ చూపిస్తుంటారు" అని ఆమె పేర్కొన్నారు.
Devara Movie Cast : ఇక 'దేవర' సినిమా విషయానికి వస్తే ఈ చిత్రంలో తారక్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది. సీనియర్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యుయల్ రోల్లో కనిపించారు. శ్రీకాంత్, శ్రుతి మారాఠే, చైత్ర రాయ్, షైన్ టామ్, మురళీ శర్మ, ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ తదితరులు నటించారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీంతం అందించగా, రత్నవేలు డీఓపీ బాధ్యతలు చూశారు. ఎన్టీఆర్, యువసుధ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని రూపొందించింది.