తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'దేవర 2' విషయంలో కొరటాల శివ ప్రామిస్ - ' ఆ సీన్స్​ ఫ్యాన్స్​కు మర్చిపోలేని అనుభూతిని అందిస్తాయి' - KORATALA SHIVA ABOUT DEVARA 2

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తాజాగా 'దేవర' సీక్వెల్​ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఓ విషయం గురించి ఫ్యాన్స్​కు ప్రామిస్ చేశారు. అదేంటంటే?

KORATALA SHIVA ABOUT DEVARA 2
Director Koratala Shiva About Devara 2 (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Oct 8, 2024, 9:42 AM IST

Jr NTR Devara 2 :మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్​టీఆర్ రీసెంట్ మూవీ 'దేవర' ప్రస్తుతుం బాక్సాఫీస్​ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. ఇప్పటికే ఈ చిత్రం సుమారు రూ. 466 కోట్ల కలెక్షన్​ సాధించి ట్రెండ్ అవుతోంది. అయితే దీనికి సీక్వెల్​ రానుందంటూ డైరెక్టర్ కొరటాల శివ గతంలోనే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ విషయం గురించి తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

"దేవర పార్ట్ 2లో జాన్వీ కపూర్​ రోల్​ అసాధారణంగా ఉంటుంది. మీరందరూ ఆ పాత్రను చూసి ఆశ్చర్యపోతారు. ఫస్ట్ పార్ట్ కంటే దీని సీక్వెల్​ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. సినిమా చూసే ప్రేక్షకులు సీట్‌ ఎడ్జికి వస్తారు. ఓ డైరెక్టర్​గా నేను పార్ట్‌ 2 విషయంలోనూ ఎంతో నమ్మకంగా, ఆసక్తిగా ఉన్నాను. కథలో అసలు ట్విస్ట్​ పార్ట్‌ 2లోనే ఉంది. ప్రతీ పాత్ర చాలా హై లో ఉంటుంది. ఎన్​టీఆర్​ ఫ్యాన్స్ అందరికీ ఒక్కటే చెబుతున్నాను. పార్ట్‌1లో మీరు చూసింది 10 శాతం మాత్రమే. కానీ రెండో భాగంలో మీరు 100శాతం చూస్తారు. ప్రతీ పాత్రలో ట్విస్ట్‌ ఉంటుంది. కొన్ని సీన్స్ మీకు జీవితంలో మర్చిపోలేని అనుభూతిని అందిస్తాయి. ఈ విషయంలో నేను మీకు ప్రామిస్‌ చేస్తున్నాను. తారక్‌ నటన గురించి చెప్పనక్కర్లేదు. ఆయన తన పాత్రకు జీవం పోస్తారు" అంటూ కొరటాల శివ 'దేవర 2'కి మరింత హైప్ పెంచారు.

మరోవైపు తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ ఎన్టీఆర్‌ 'దేవర 2' గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫస్ట్ పార్ట్ షూటింగ్ టైమ్​లోనే పార్ట్‌ 2 కోసం కొన్ని సీన్స్ షూట్‌ చేసినట్లు చెప్పారు. ఫస్ట్‌ పార్ట్‌ మంచి విజయం సాధించడం వల్ల తమ బాధ్యత మరింత పెరిగిందని అన్నారు. 'దేవర' కంటే దాని సీక్వెల్‌ ఇంకా బాగుంటుందంటూ ధీమా వ్యక్తం చేశారు. స్టోరీ అయితే ప్రస్తుతానికి రెడీగా ఉందని, మరికొంత మెరుగులు దిద్దాలని అన్నారు. 'దేవర' కోసం డైరెక్టర్ కొరటాల శివ ఎంతో కష్టపడ్డారని వెల్లడించారు.

'దేవర' సక్సెస్​ మీట్​ - సెలబ్రేషన్స్​ కోసం తారక్ కూడా వెయిటింగ్ అంట! - Devara Success Meet

'వార్ 2'పై ఎన్టీఆర్ ఫోకస్- షూటింగ్ సెట్స్​లోకి రీ ఎంట్రీ! - NTR War 2 Update

ABOUT THE AUTHOR

...view details