తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

బాక్సాఫీస్ దగ్గర సినిమా ఫ్లాప్​ - దివాలా తీసిన ప్రముఖ దర్శకుడు - Joram Movie Director Devashish

Joram Movie Director Devashish : ఓ ప్రముఖ దర్శకుడు ప్రస్తుతం ఇంటి అద్దె కూడా కట్టలేని దీనస్థితికి వచ్చారు. రీసెంట్​గానే ఆయన తెరకెక్కించిన ఓ సినిమా విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంది. కానీ వసూళ్లను సాధించలేకపోయింది. దీంతో తాను దివాలా తీసినట్లు పేర్కొంటూ తన ఆర్థిక పరిస్థితిని వివరించి భావోద్వేగానికి గురయ్యారు.

బాక్సాఫీస్ దగ్గర సినిమా ఫ్లాప్​ - దివాలా తీసిన ప్రముఖ దర్శకుడు
బాక్సాఫీస్ దగ్గర సినిమా ఫ్లాప్​ - దివాలా తీసిన ప్రముఖ దర్శకుడు

By ETV Bharat Telugu Team

Published : Mar 17, 2024, 6:42 AM IST

Joram Movie Director Devashish : సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. అదృష్టం కలిసిరాకపోతే ఎంత పెద్ద స్టార్ సెలబ్రిటీ అయినా కెరీర్​లో కింద పడాల్సి వస్తుంది. సినిమాలైతే కొన్ని సార్లు కంటెంట్ పరంగా మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద కమర్షియల్​గా విజయం సాధించలేవు. అయితే తాజాగా ఓ దర్శకుడి పరిస్థితి ఇదే అయింది. ప్రేక్షకులను ఆలోచింపచేసే సినిమాలను తెరకెక్కించిన ఆయన వాటికి సరైన కలెక్షన్స్ రాక, పెట్టిన బడ్జెట్​ కూడా తిరిగి రాక ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఇంటి అద్దె కూడా కట్టలేని దీనస్థితికి వచ్చారు.

ఆయనే దేవాశిశ్‌ మఖిజా. రీసెంట్​గా ఆయన జోరమ్​ అనే చిత్రానికి దర్శకనిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా కంటెంట్ పరంగా మంచి టాక్ తెచ్చుకుంది. విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంది. కానీ వసూళ్లను మాత్రం సాధింలేకపోయింది. ఈ నేపథ్యంలో తన ఆర్థిక పరిస్థితి గురించి వివరించారు దేవాశిక్.

"నేను ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి దాదాపు 20 సంవత్సరాలు అయింది. ఇప్పుడు నా వయసు 40. ఇప్పుడు నా పరిస్థితి ఎలా మారిందంటే కనీసం ఓ సైకిల్‌ కొనేందుకు కూడా డబ్బులు లేవు. ఇప్పటి వరకు చాలా సినిమాలు చేశాను. కానీ, ఒక్క రూపాయి సంపాదించలేకపోయాను. జోరమ్‌ చిత్రం పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాలేదు. దివాలా తీశాను. గత ఐదు నెలల నుంచి అద్దె కూడా కట్టలేకపోతున్నాను. నన్ను బయటకు గెంటేయొద్దని నా ఇంటి ఓనర్​ను బతిమాలుతున్నాను. నా దగ్గర ఇంకా 20 స్క్రిప్ట్‌లు ఉన్నాయి. వాటిని ప్రొడ్యూస్ చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. అందరూ తప్పకుండా ఆర్ట్‌, కామర్స్‌ మధ్య సమతుల్యత ఉండేలా చూసుకోవాలి. ఈ విషయాన్ని నేను ఆలస్యంగా తెలుసుకున్నాను" అని పేర్కొన్నారు.

కాగా, కోల్‌కతాకు చెందిన వ్యక్తి దేవాశిశ్‌. షార్ట్ ఫిల్మ్​తో దర్శకుడిగా కెరీర్‌ ప్రారంభించారు. 2017లో రిలీజైన అజ్జి సినిమాతో డైరెక్టర్​గా మారారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ కలెక్షన్లను సాధించలేకపోయింది. ఆ తర్వాత భోంస్లేకు విశేష ఆదరణ దక్కించుకుంది. ఇక రీసెంట్​గా ఆయన మనోజ్‌ బాజ్‌పాయ్‌ హీరోగా జోరమ్‌ అనే సినిమా చేశారు. గతేడాది రిలీజైన ఈ చిత్రం ప్రశంసలను అందుకున్నప్పటికీ వసూళ్లను సాధించలేకపోయింది.

అంతా పాన్ ఇండియా మయం - పక్క ఇండస్ట్రీలపై తెలుగు నిర్మాతల ఫోకస్

డేంజర్ జోన్​లో ఈ దర్శకులు - మళ్లీ హిట్​ కొడితేనే రేసులోకి!

ABOUT THE AUTHOR

...view details