Janhvi Kapoor On Gym Wear Photos:బాలీవుడ్ అందాల నటి జాన్వీ కపూర్, ప్రస్తుతం భారీ ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉంది. జాన్వీ సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటుంది. తరచూ ఆమె ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతుంటాయి. దీనిపై తాజాగా ఈ బాలీవుడ్ బ్యూటీ స్పందించింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన ఫొటోలు తీయవద్దని చెప్పినా, ఫ్రీల్యాన్స్ ఫొటోగ్రాఫర్(Paparazzi)లు వెంటపడుతుంటారని చెప్పింది. ఇంతకు ముందు కూడా ఈ అంశంపై జాన్వీ ఆందోళన వ్యక్తం చేసింది.
జిమ్ దగ్గర ఫొటోలు ఏంటి?
'ప్రజలు నేను టైట్ డ్రెస్‌లలో ఉన్నప్పుడు చూడటాన్ని నేను ఇష్టపడను. జిమ్‌కు వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు ఫొటోలు క్లిక్ చేయవద్దని పాపరాజ్జిలకు చెప్తుంటాను. వాళ్లను మూవీ ప్రమోషన్స్ టైమ్‌లో పిలవడం నిజమే. కానీ జిమ్‌కు పిలవను. నా కారును ఫాలో అయ్యి స్పాట్‌కు చేరుకుంటారు' అని జాన్వీ చెప్పింది.
సాధారణ ప్రజలు మేలు!
తనతో ఫొటోలు దిగడానికి, ఫొటోలు తీయడానికి చాలా మంది వచ్చేవారని (ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్లు కాదు) చెప్పింది. అయితే జిమ్ బయట ఉండొద్దని మర్యాదపూర్వకంగా కోరానని, అప్పటి నుంచి వాళ్లను ఆ ప్లేస్‌లో చూడలేదని పేర్కొంది. బెస్ట్ థింగ్ ఏంటంటే ఫొటోలు తీయకండి, జిమ్ వద్దకు రావాలని ఎప్పుడూ పాపరాజ్జిలను కోరలేదని స్పష్టం చేసింది.