Jackky Bhagnani Rakul Preet Singh Honey Moon : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ రీసెంట్గా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తన ప్రియుడు, బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీని పెళ్లాడింది. వీరి పెళ్లి గోవాలోని ఓ రిసార్ట్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో గ్రాండ్‌గా జరిగింది. సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రిటీలు కూడా ఈ వివాహ వేడుకకు హాజరై సందడి చేశారు. నూతన వధూవరులను ఆశ్వీర్వదించారు.
అయితే ఇప్పుడీ కొత్త జంట రకుల్ ప్రీత్ సింగ్ - జాకీ భగ్నానీ తమ హనీమూన్ విషయంలో బాలీవుజ్ హీరో రణబీర్ కపూర్‌ను ఫాలో అవుతున్నట్లు బయట కథనాలు కనపడుతున్నాయి. అదేంటి రణ్‌బీర్‌ను ఫాలో అవ్వడం ఏంటని అనుకుంటున్నారా? అదేంటంటే ఈ జంట తమ హనీమూన్ ట్రిప్‌ను నెక్ట్స్ లెవెల్లో ప్లాన్ చేసుకుంటున్నారట. వెరైటీగా ఉండేలని అనుకుంటున్నారట.రీసెంట్గా రణ్‌బీర్ నటించిన యానిమల్ సినిమా బాక్సాఫీస్ ముందు ఎలాంటి సెన్సేషనల్ హిట్ అయిందో తెలిసిన విషయమే.
ఈ చిత్రంలో రణబీర్ కపూర్ రష్మికతో తన హనీమూన్‌ను ఎప్పటికీ గుర్తిండి పోయే విధంగా ఫ్లైట్‌లో ప్లాన్ చేస్తాడు. ఇప్పుడు అలానే రకుల్ - జాకీ(Rakul Preet singh Marriage) కూడా చేయబోతున్నారని బయట టాక్ వినిపిస్తోంది. మరి ఈ విషయంలో ఎంత నిజం ఉందో తెలీదు కానీ సోషల్ మీడియాలో, బాలీవుడ్ మీడియా వర్గాల్లో ఈ చర్చ నడుస్తోంది.