ETV Bharat / entertainment

బ్యాక్​ టు బ్యాక్ రిలీజెస్​తో రష్మిక​ మందాన్న - 10 నెలల్లో 6 సినిమాలతో! - RASHMIKA MANDANNA UPCOMING MOVIES

ఫుల్​ బిజీబిజీగా హీరోయిన్ రష్మిక - ఈ ముద్దుగుమ్మ నటిస్తున్న సినిమాల లిస్ట్ ఇదే

Rashmika Upcoming Movies
Rashmika Upcoming Movies (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 11, 2024, 6:37 PM IST

Rashmika Mandanna Upcoming Movies : సౌత్ ఇండస్ట్రీతో పాటు నార్త్​లోనూ వరుస సినిమాలు చేస్తూ కెరీర్‌లో దూసుకెళ్తోంది హీరోయిన్ రష్మిక. గతేడాది యానిమల్‌ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత మళ్లీ తెరపై కనిపించలేదు. అలా అని ఆమెమీ గ్యాప్ తీసుకోలేదు. ప్రస్తుతం ఈ భామ చేతినిండా చిత్రాలతో వరుస షూటింగ్స్‌తో గ్యాప్‌ లేకుండానే గడుపుతోంది. ఈ సారి పది నెలల గ్యాప్​లోనే ఏకంగా అరడజను సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

మొదటగా పుష్ప 2 ది రూల్ చిత్రంతో శ్రీ వల్లిగా ఈ ఏడాది డిసెంబర్​లో థియేటర్లలో సందడి చేయనుంది. మొదటి భాగం కన్నా రెండో భాగంలో ఎక్కువగా రష్మిక పాత్రను దర్శకుడు సుకుమార్ తీర్చిదిద్దినట్టు ఇప్పటికే టాక్ నడుస్తోంది. క్యారెక్టరైజేషన్ అద్భుతంగా ఉంటుందని అంటున్నారు.

ఈ సినిమా విడుదలైన నెలలోపే బాలీవుడ్ చిత్రం ఛావాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరాఠా వీరుడు శంభాజీ కథ ఆధారంగా రూపొందిన ఈ హిస్టారికల్ డ్రామాలో విక్కీ కౌశల్ సరసన నటించింది. శంభాజీ భార్య ఏసుబాయి పాత్రలో మెప్పించనుంది.

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న సికందర్​ చిత్రంలోనూ హీరోయిన్​గా నటిస్తోంది రష్మిక. ఈద్ సందర్భంగా ఈ చిత్రం థియేటర్లకు రానుంది. మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు.

నాగార్జున ధనుశ్​ కాంబోలో రూపొందుతున్న కుబేరలోనూ రష్మిక కీలక పాత్రలో నటిస్తోంది. శేఖర్ కమ్ముల రష్మికను ఎలా ప్రెజెంట్ చేస్తారనే ఆసక్తి అభిమానుల్లో ఎక్కువగానే ఉంది.

రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ది గర్ల్ ఫ్రెండ్ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం దాదాపుగా చివరి దశకు చేరుకుంది. విడుదల తేదీ ఇంకా పక్కా కాలేదు. వచ్చే ఏడాది సమ్మర్​లో వచ్చే అవకాశముంది.

'స్త్రీ', 'బేడియా', 'ముంజ్య' క్రియేటర్స్‌ రూపొందిస్తున్న మరో హారర్ డ్రామా తమాలోనూ రష్మిక మందన్న నటించనుంది.

ఇంకా రైన్​బో అనే మరో చిత్రాన్ని కూడా చేస్తోంది. కానీ ప్రస్తుతానికి ఈ సినిమా ఆప్డేట్స్ ఏమీ రావట్లేదు. ఇలా మొత్తంగా దాదాపు అరడజనకుపైగా చిత్రాల్లో నటిస్తోంది రష్మిక. ఇవన్నీ బ్యాక్​ టు బ్యాక్​ రిలీజ్ కానున్నాయి.

కొత్త పోస్టర్​తో 'పుష్ప 2' సర్​ప్రైజ్​ - ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్​

రుక్మిణీ వసంత్​ యమా బిజీబిజీ - అన్నీ పాన్ ఇండియా సినిమాలే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.