Director Krish Marriage : టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ క్రిష్ వివాహం వేడుకగా జరిగింది. ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రీతి చల్లాతో ఆయన ఏడడుగులు సోమవారం వేశారు. హైదరబాద్‌లో జరిగిన ఈ పెళ్లి వేడుకకు ఇరువురి కుటుంబ సభ్యులతో పాటు అతి కొద్దిమంది సన్నిహితులు మాత్రమే హాజరైనట్టు సమాచారం. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన పలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. ఇది చూసి ఫ్యాన్స్ ఆయనకు కంగ్రాజ్యూలేషన్స్ చెబుతున్నారు. కొత్త జంట బాగుందంటూ నూతన దంపతులను ఆశీర్వదిస్తున్నారు.
When Two Souls Unite, Magic Happens 🫶🫶🫶
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) November 11, 2024
Filmmaker #KrishJagarlamudi and Dr. #PritiChalla have tied the knot today in an intimate wedding ceremony 😍
Wishing the lovely duo a lifetime of happiness, shared dreams, and endless adventures ✨@DirKrish pic.twitter.com/nGIi2vln34
ఇక డైరెక్టర్ క్రిష్ సినీ కెరీర్ విషయానికి వస్తే, 'గమ్యం'తో ఇండస్ట్రీకి పరిచయమైన ఆయన, తొలి సినిమాతోనే టాలీవుడ్‌లో తన ప్రత్యేకతను చాటుకున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో మనసుకు హత్తుకునే సినిమాలు తీయడంలో ఆయన స్పెషలిస్ట్. ఇక 'గమ్యం' తర్వాత 'వేదం', 'కంచె', 'కొండపొలం' లాంటి చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించారు. పలు అవార్డులు కూడా సొంతం చేసుకున్నారు. కంచె సినిమాకు గానూ ఆయన బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో నేషనల్ అవార్డును అందుకున్నారు. అలాగే గమ్యం సినిమాకు ఆయన ప్రతిష్టాత్మక నంది అవార్డును సొంతం చేసుకున్నారు.
బాలయ్యతో విజయవంతమైన కాంబో
ఇక నందమూరి నటసింహం బాలకృష్ణతో క్రిష్‌కు ఓ ప్రత్యేక అనుబంధం ఉంది. బాలయ్య వందో సినిమా 'గౌతమి పుత్ర శాతకర్ణి'కి క్రిష్ డైరెక్టర్. ఇది ఓ చరిత్రాత్మక చిత్రం. 2017 జనవరి 12న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఆ తర్వాత ఈయన బాలకృష్ణతో 'కథానాయకుడు', 'మహానాయకుడు' లాంటి సినిమాలను రూపొందించారు. సీనియర్ ఎన్టీఆర్ జీవితాధారంగా తీసిన ఈ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాల్ని అందుకున్నాయి.
ప్రస్తుతం అనుష్క శెట్టితో 'ఘాటి' అనే పాన్ఇండియా మూవీని తెరకెక్కిస్తున్నారు క్రిష్. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ తాజాగా విడుదల అవ్వగా, దానికి నెట్టింట విశేష స్పందన లభించింది. మరోవైపు ఆయన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లీడ్ రోల్లో రూపొందుతున్న 'హరిహర వీరమల్లు' సినిమాకు సంబంధించి కొంత భాగం డైరెక్ట్ చేశారు.
డైరెక్టర్ విషయంలో ట్విస్ట్ - క్రిష్ స్థానంలో ఎవరంటే? - Harihara veeramallu Teaser