ETV Bharat / sports

ధోనీని ఆకట్టుకున్న 17 ఏళ్ల యంగ్​ ప్లేయర్‌ - ఐపీఎల్​లో​ CSK తరఫున బరిలోకి దిగే ఛాన్స్!

ఐపీఎల్​ 2025 ముందు సీఎస్కే ఫ్రాంఛైజీని ఆకట్టుకున్న 17 ఏళ్ల కుర్రాడు!

IPL 2025 Dhoni
IPL 2025 Dhoni (source Getty Images)
author img

By ETV Bharat Sports Team

Published : Nov 11, 2024, 9:15 PM IST

IPL 2025 Who Is Ayush Mhatre : 2025 ఐపీఎల్‌ సీజన్‌ మొదలు కావడానికి ఇంకా కొన్ని నెలల సమయం ఉంది. కానీ త్వరలో జరగనున్న మెగా వేలంతో అప్పుడే సందడి మొదలైపోయింది. ఈ సమయంలో ఓ యంగ్‌ ప్లేయర్‌ అద్భుత ప్రదర్శనలతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. అతడే ముంబయి బ్యాటర్‌ ఆయుష్ మత్రే. ఈ 17 ఏళ్ల కుర్రాడు డొమెస్టిక్‌ క్రికెట్‌లో తన ప్రదర్శనలతో చెన్నై సూపర్ కింగ్స్, మాజీ కెప్టెన్ ఎంఎస్‌ ధోని దృష్టి సైతం ఆకర్షించడం గమనార్హం.

ముంబయిలోని వైబ్రెంట్ క్రికెట్ కమ్యూనిటీ నుంచి వచ్చిన మత్రే డొమెస్టిక్‌ సర్క్యూట్‌లో అదరగొట్టాడు. ఈ సీజన్‌లో ఇరానీ కప్‌లో ముంబయి తరపున ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు.

ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో మొత్తం 5 మ్యాచుల్లో 35.66 యావరేజ్‌తో 321 పరుగులు చేశాడు. ఇందులో రంజీ ట్రోఫీలో మహారాష్ట్రపై చేసిన 176 పరుగులు చాలా ప్రత్యేకం. ఈ ప్రదర్శనతోనే మత్రే సీఎస్కే దృష్టిని ఆకర్షించాడు. అతడి కంపోజ్డ్, అగ్రెస్సివ్‌ బ్యాటింగ్, చిన్న వయస్సులో చూపుతున్న మెచ్యూరిటీ ఐపీఎల్‌ ఫ్రాంచైజీలను మెప్పించాయి.

రంజీ ట్రోఫీలో అరంగేట్రం - తన తొలి రంజీ ట్రోఫీ మ్యాచ్‌లోనే మత్రే సెంచరీ బాదాడు. 2024 అక్లోబర్‌లో మహారాష్ట్రపై 127 పరుగులు చేశాడు. సీనియర్ బౌలర్లను సులువుగా ఎదుర్కోవడంలో మత్రే సామర్థ్యం, గేమ్ సెన్స్ ముంబయి సెలెక్టర్లను మాత్రమే కాకుండా ఐపీఎల్‌ ఫ్రాంచైజీలను ఆకర్షించింది.

పృథ్వీ షా బహుమతిగా ఇచ్చిన బ్యాట్‌తోనే మత్రే ఈ ఇన్నింగ్స్‌ ఆడాడు. ముంబయి జట్టు ప్రారంభంలో ఎదురుదెబ్బలు ఎదుర్కొన్నప్పటికీ, మత్రే తన ఆటతో జట్టును నిలబెట్టాడు. అజింక్య రహానే, శ్రేయాస్ అయ్యర్‌తో కీలక పార్ట్‌నర్‌షిప్‌లు నెలకొల్పాడు. సమర్థవంతంగా స్ట్రైక్‌ రొటేట్‌ చేస్తూ టీమ్‌ స్కోర్‌ను ముందుకు తీసుకెళ్లాడు. ముంబయిని పటిష్ఠ స్థాయిలో నిలిపాడు.

చెన్నై సూపర్ కింగ్స్ ఆసక్తి - ఐపీఎల్ 2025 మెగా వేలం ముందు సీఎస్కే యంగ్‌ బ్యాటర్‌పై ఆసక్తిని వ్యక్తం చేసింది. అతడిని ట్రయల్స్‌కు ఆహ్వానించింది. రంజీ ట్రోఫీ ఐదో రౌండ్, సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ మధ్య విరామం సమయంలో మత్రే ట్రయల్స్‌కు హాజరవుతాడు.

సీఎస్కే ఎండీ, సీఈఓ కాశీ విశ్వనాథన్, మత్రే ట్రయల్స్‌కు హాజరు కావడానికి ముంబయి క్రికెట్ అసోసియేషన్ (MCA) అనుమతి కూడా కోరారు. సీఎస్కేలో ధోనీ చాలా మంది యంగ్‌ ప్లేయర్‌లను తీర్చిదిద్దాడు. మత్రేను సీఎస్కే కొనుగోలు చేస్తే అతడికి ధోనీ కన్నా మెరుగైన మెంటర్ మరొకరు లేరనే చెప్పాలి.

భారత్ లేకుండా ఛాంపియన్స్ ట్రోఫీ జరగదు- ఆ విషయం పాక్​కు తెలుసు! : ఆకాశ్ చోప్రా

'గంభీర్‌ను ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లకు పంపొద్దు' - బీసీసీఐకి మాజీ క్రికెటర్ స్పెషల్ రిక్వెస్ట్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.