ETV Bharat / entertainment

1500 ఏళ్ల నాటి ప్రపంచం, రూ.300 కోట్ల బడ్జెట్​ - 'కంగువా' 10 ఆసక్తికర విశేషాలివే! - SURIYA KANGUVA INTERESTING FACTS

సూర్య 'కంగువా' సినిమాకు సంబంధించిన ఆసక్తికర విశేషాలివే!

Kanguva Movie 10 Interesting Facts
Kanguva Movie 10 Interesting Facts (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 11, 2024, 7:29 PM IST

Kanguva Movie 10 Interesting Facts : కోలీవుడ్ స్టార్ హీరో నటించిన 'కంగువా' మరో మూడు రోజుల్లో థియేటర్లలో గ్రాండ్​గా విడుదల కానుంది. ఈ సినిమా కోసం హీరో సూర్య ఎంతో శ్రమించారు. మున్నపెన్నడూ కనిపించని రీతిలో, పాత్రలో నటించారు. భిన్నమైన కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం కోసం తెలుగు ఆడియెన్స్​ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నవంబర్ 14న ఇది రానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

  • సూర్యకు ఇది 42వ చిత్రం కాగా, దర్శకుడు శివకు ఇది 10వ సినిమా. అలాగే వీరిద్దరి కాంబోలో తెరకెక్కిన తొలి సినిమా ఇదే.
  • ఈ కంగువా చిత్రంలో సూర్య కంగ, ఫ్రాన్సిస్​ అనే పాత్రలు పోషించారు. అలాగే విభిన్నమైన గెటప్స్​లో కనిపించనున్నారు.
  • ఈ చిత్రంతో దిశా పటాని కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వనుంది. ఆ మధ్య ప్రభాస్ కల్కి 2898 ఏడీ చిత్రంలో కనిపించి సందడి చేసింది.
  • బాలీవుడ్ స్టార్ యాక్టర్​ బాబీ దేఓల్​కు ఇదే తొలి సౌత్ మూవీ కావడం విశేషం. యానిమల్​తో ఆయన కనిపించినప్పటికీ అది హిందీ సినిమానే. పైగా ఆ సినిమా కన్నా ముందే కంగువాను ఒప్పుకున్నారు బాబీ దేఓల్. కంగువాలో ఆయన ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు.
  • ఈ చిత్రంలో సూర్య సోదరుడు, హీరో కార్తి కూడా కనిపించనున్నారు. ఇంకా పలువురు స్టార్స్ కూడా ఈ చిత్రంలో కనిపించనున్నారట.
  • 1500 ఏళ్ల నాటి ప్రపంచం, అప్పటి మనుషుల భావోద్వేగాలు ప్రధానాంశాలుగా నడిచే కథ ఇది.
  • తమిళంలో సూర్యనే డబ్బింగ్ చెప్పారు. అయితే ఏఐ సాయంతో ఇతర భాషల్లో డబ్బింగ్ చేసిన తొలి కోలీవుడ్ చిత్రం ఇదే కావడం విశేషం.
  • రూ.300కోట్లకు పైగా బడ్జెట్తో దీన్ని తెరకెక్కించారు. తెలుగుతో పాటు 8 భాషల్లో దాదాపు 10 వేల స్క్రీన్లలో విడుదల చేయనున్నారు.
  • 3డీలోనూ విడుదల కానుందీ సినిమా. ఈ చిత్రం రన్ టైమ్​ 2 గంటల 34 నిమిషాలు
  • మొసలితో హీరో చేసే ఫైటింగ్ సన్నివేశం సినిమాకే హైలైట్​గా నిలువనుందట. అండర్ వాటర్ వారం పాటు ఈ సీక్వెన్స్​ను చిత్రీకరించారు.

'బాహుబలి సినిమాకు స్ఫూర్తి సూర్యనే- ఆయనతో సినిమా చేయాలకున్నా కానీ!'

బ్యాక్​ టు బ్యాక్ రిలీజెస్​తో రష్మిక​ మందాన్న - 10 నెలల్లో 6 సినిమాలతో!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.