ETV Bharat / state

బాసర ట్రిపుల్​ ఐటీలో విద్యార్థిని అనుమానాస్పద మృతి - క్యాంపస్​లో ఆందోళనలు - BASARA IIIT STUDENT DEATH CONCERNS

బాసర ఐఐఐటీలో విద్యార్థిని మృతిపై ఆందోళనలు - ఉరివేసుకొని చనిపోయిందని అధికారుల ప్రకటన - తమ కుమార్తెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని కుటుంబసభ్యుల ఆందోళన

BASARA IIIT Student Suicide
BASARA IIIT Student Suspicious Death Concerns (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 11, 2024, 10:36 PM IST

BASARA IIIT Student Suspicious Death Concerns : నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీలో పీయూసీ 2 చదువుతున్న విద్యార్థిని స్వాతి ప్రియ మృతితో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మృతిపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ కుమార్తెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని వారు ఆరోపించారు. స్వాతి ప్రియ ఆదివారం రాత్రి క్యాంపస్​లో వ్యక్తిగత కారణాలతో బాలికల వసతి గృహం -1 లో ఉరివేసుకొని చనిపోయిందని ఆర్జీయూకేటీ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. విద్యార్థిని స్వస్థలం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్​లోని పెర్కిట్ గ్రామం. విద్యార్థిని వద్ద సూసైట్ నోట్ లభ్యమైనట్లు తెలిపారు. అయితే స్వాతి ప్రియ తల్లిదండ్రులు మాత్రం కాలేజీ ప్రకటనను ఖండించారు.

హాస్టల్​లో చనిపోయిన అమ్మాయిని తాము వచ్చేసరికి ఎలా బయటకు తీసుకొచ్చారని వారు పోలీసులను ప్రశ్నించారు. ఆసుపత్రికి తీసుకొచ్చిన ఎస్​ఐ గణేశ్​​తో వాగ్వాదానికి దిగారు. సీనియర్ విద్యార్థి వేధించడం వల్లే తన సోదరి మృతి చెందిందని ఆమె సోదరుడు భజరంగ్ ఆరోపించారు. దీనిపై కాలేజీలో ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని వాపోయారు. క్యాంపస్​లో సీనియర్లు, జూనియర్లను వేధిస్తున్నారని, వారి నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని ఆరోపించారు. స్వాతి ప్రియ మృతికి కారకులపై చర్యలు తీసుకునే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని వారు హెచ్చరించారు.

"మా పాపను వీల్లే ఏదో చేసి చంపేశారు. మేము వస్తున్నామన్నా హాస్టల్​లో డెడ్​బాడీని ఉంచలేదు. ఇక్కడ హాస్టల్​ కూడా రెండుమూడుసార్లు కంప్లైంట్​ ఇచ్చినా వారు ఏమీ పట్టించుకోలేదు. అక్కడ సీనియర్ అబ్బాయిలు జూనియర్లను బాగా ఇబ్బంది పెడుతున్నారు. ఫిర్యాదు చేసినా మేనేజ్​మెంట్​ పట్టించుకోకే ఇదంతా అయ్యింది."- మృతురాలి కుటుంబసభ్యులు

ఏబీవీపీ కార్యకర్తలపై కాలేజీ సిబ్బంది కర్రలతో దాడి : మరోవైపు మృతికి కారకులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఆర్​జీయూకేటీ ప్రధాన ద్వారం వద్ద ముట్టడికి యత్నించారు. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా వారిని సిబ్బంది అడ్డుకున్నారు. ఏబీవీపీ కార్యకర్తలపై కాలేజీ సిబ్బంది కర్రలతో దాడి చేయగా సాయి కుమార్ అనే యువకుడి తలకు బలమైన గాయమైంది. వెంటనే అతడిని భైంసా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

అందరిముందు అవమానం - ఆ స్టూడెంట్​ను కఠినమైన నిర్ణయం తీసుకునేలా చేసింది

మీ టార్చర్ వల్లే మా పాప సూసైడ్ చేసుకుంది - బాచుపల్లి కాలేజీపై తల్లిదండ్రుల ఆగ్రహం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.