Shocking News For Apple Lovers: ఐఫోన్ లవర్స్‌కు షాకింగ్ న్యూస్. టెక్ దిగ్గజం యాపిల్ తన 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్, ఐఫోన్ 13 మోడల్స్ ఐఫోన్ ప్రొడక్షన్‌ను నిలిపివేసింది. అంతేకాకుండా వాటిని స్టోర్ల నుంచి కూడా తొలగించాలని కంపెనీ నిర్ణయించింది. అయితే ఇప్పటికే వాడుకలో ఉన్న ఈ మోడళ్లకు ఫ్యూచర్ అప్‌డేట్స్ అందుబాటులో ఉన్నాయి.
ఐఫోన్ 16 సిరీస్ మార్కెట్లోకి రావడంతో కంపెనీ కొన్ని పాత మోడళ్ల ధరలను తగ్గించింది. ధర తగ్గింపు తర్వాత పాత మోడల్ ఐఫోన్‌లను కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉన్న యాపిల్ ప్రియులు ఇప్పుడు కంపెనీ నిర్ణయంతో కాస్త నిరాశకు గురయ్యారు.
యాపిల్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఇక నుంచి కస్టమర్లు ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్రో మోడల్ మొబైల్స్ మాత్రమే అందుబాటులో ఉంటాయి. అయితే వెబ్‌సైట్ నుంచి తొలగించిన ఐఫోన్‌ల సర్వీస్, సెక్యూరిటీ అప్‌డేట్స్, OS అప్‌డేట్స్ మాత్రం కంటిన్యూ చేస్తామని కంపెనీ తెలిపింది.
అయితే వెబ్‌సైట్ నుంచి తొలగించిన ఐఫోన్‌లను ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ మార్కెట్‌ల నుంచి కొనుగోలు చేయొచ్చు. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు ప్రస్తుతం ఐఫోన్‌లపై బంపర్ ఆఫర్లను అందిస్తున్నాయి. ప్రస్తుతం ఐఫోన్ 13, ఐఫోన్ సిరీస్‌లలో ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లో మంచి డిస్కౌంట్స్ ఉన్నాయి.
పనిచేయకుండా ఆగిపోయిన చాట్‌జీపీటీ- ఆందోళనలో వినియోగదారులు
గేమింగ్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్- ఇండియాలో సోనీ ప్లేస్టేషన్ పీఎస్ 5ప్రో లాంచ్ రద్దు- ఎందుకో తెలుసా?