Indias Richest Actor : అది 1993వ సంవత్సరం. ఒక బాలీవుడ్ నటుడు ఒక సినిమాకు రూ.కోటి రెమ్యూనరేషన్ తీసుకోవడం మొదలుపెట్టారు. అలా అప్పటి నుంచి మూడు దశాబ్దాలుగా ఒక్కో సినిమాకు ఎదుగుతూ, హిట్ కెరీర్‌తో వెలుగొందుతూ ఇండియన్ సినిమా మార్కెట్‌లో కింగ్ అయిపోయారు. ఒక్కో సినిమాకు రూ.100 కోట్ల రెమ్యునరేషన్ అందుకోవడంతో పాటు సినిమాల్లో లాభాలు కూడా అందుకుంటున్నారు. అలా వేల కోట్లు సంపాదిస్తున్న హీరో మరెవరో కాదు బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్. ఫుట్‌పాత్‌ల దగ్గర మొదలైన ఈయన ప్రయాణం విలాసవంతమైన మన్నత్ బంగ్లా వరకూ ఎలా సాగిందో తెలుసుకుందాం.
Sharukh Khan Net Worth : 30 ఏళ్లుగా బాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ హీరోగా దూసుకెళ్తున్నారు షారుక్ ఖాన్. సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్‌లతో పాటు బాక్సాఫీస్ దగ్గర పోటీపడుతూనే ఉన్నారు. అదే ఆయన్ను దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అత్యంత ధనికుడైన నటుడిగా మార్చింది. ఇంగ్లీష్ మీడియా కథనాల ప్రకారం సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ ఆస్తులు రూ.3వేల కోట్లు, రూ.1500 కోట్లు ఉంటే, అమితాబ్ బచ్చన్ ఆస్తుల విలువ రూ.3300 కోట్లు అని సమాచారం. కానీ, షారుక్ ఖాన్ ఆస్తులు విలువ మాత్రం రూ.6300 కోట్లు అని చెబుతున్నారు.
మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన షారుక్ ఖాన్ తల్లి పబ్లిక్ సర్వెంట్. షారుక్‌ను దిల్లీ టాప్ స్కూల్స్‌లో చదివించారు. అయితే బాద్ షా చదువును పక్కకు పెట్టేసి టీవీ యాక్టర్ అవుదామనుకున్న వెంటనే ఆయన కష్టాలు మొదలయ్యాయి. ముంబయికు వచ్చిన వెంటనే ఎవరూ తెలియని సమయంలో ఎక్కడికీ వెళ్లేందుకు డబ్బుల్లేక రైల్వేస్టేషన్లో, ఫుట్‌పాత్‌ల మీద పడుకున్నారట. ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎదుగుతూ వచ్చిన అవకాశాల్ని వినియోగించుకుంటూ బాంద్రాలో వందల కోట్లు విలువ చేసే మన్నత్ అనే ఇంటిని కట్టుకోగలిగారు.