Indian 2 Audio Launch Event :లోకనాయకుడు కమల్ హాసన్, డైరెక్టర్ శంకర్ కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ 'భారతీయుడు 2' ( ఇండియన్ 2). గత కొంత కాలంగా షూటింగ్లో ఉన్న ఈ మూవీ, ఎట్టకేలకు ఈ ఏడాది జూన్‌లో విడుదలయ్యేందుకు సంసిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ కూడా ప్రమోషనల్ ఈవెంట్స్‌ను వీలైనంత త్వరగా మొదలెట్టేందుకు ప్లాన్స్ వేస్తున్నారు.
అందులో భాగంగానే త్వరలో గ్రాండ్‌గా ఇండియన్ 2 ఆడియో లాంఛ్ జరగనుందని సమాచారం. సినీ వర్గాల టాక్ ప్రకారం ఈ ఈవెంట్ మే 16న జరగనుందట. చెన్నైలోని నెహ్రూ స్టేడియం వేదికగా ఈ ఆడియో లాంఛ్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, తాజాగా ఈ ఈవెంట్‌కు సంబంధించిన మరో రూమర్ నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఈ గ్రాండ్ లాంఛ్‌కు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అలాగే తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారని సమాచారం. అయితే ఈ విషయంపై ప్రస్తుతం ఎటువంటి అధికారిక సమాచారం వెలువడలేదు. కానీ ఫ్యాన్స్ మాత్రం 'ఈ రూమర్ నిజమైతే ఇక పండగే', 'త్వరగా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వండి' అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.