తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

షారుక్​, సల్మాన్​ను వెనక్కినెట్టి టాప్​లో 16 ఏళ్ల యువతి- ఎవరంటే? - IMDB Most Popular Actress - IMDB MOST POPULAR ACTRESS

IMDB Most Popular Celebrities : ఆమె వయసు 16 ఏళ్లు. కానీ ఆ వయసులోనే షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్​లతో పాటు ఆలియా, దీపికా లాంటి పాపులర్ స్టార్లను వెనక్కి నెట్టి భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన సెలబ్రిటీగా ట్రెండ్ అవుతోంది. ఇంతకీ ఆమె ఎవరంటే ?

IMDB Most Popular Celebrities
IMDB Most Popular Celebrities (Source : Getty Images)

By ETV Bharat Telugu Team

Published : May 11, 2024, 11:02 AM IST

Updated : May 11, 2024, 2:28 PM IST

IMDB Most Popular Celebrities :సెలబ్రిటీ అవడం అంత ఈజీ కాదు. నటిగా రాణించినా ఇండస్ట్రీలోని పెద్ద పెద్ద స్టార్లను ఓడించి గొప్ప ఆదరణ పొందడం మామూలు విషయం కాదు. ఎన్నో ఏళ్ల పాటు కష్టపడితే గానీ ఎన్నో ఒడిదుడుకులను ఓర్చుకుంటే గానీ పాపులర్ అవ్వలేరు. కానీ ఓ బాలీవుడ్ నటి 16 ఏళ్ల వయసులోనే పేరు పొందిన హీరో హీరోయిన్లను వెనక్కినెట్టి భారత్​లో అత్యంత పాపులర్ సెలబ్రిటీగా ట్రెండ్ అవుతోంది. ఆమె ఎవరంటే ?

ది ఇంటర్నెట్ మూవీ డేటా బేస్(IMDB) ఇండియా ఇటీవలె అత్యంత ప్రజాధారణ పొందిన భారతీయ సెలబ్రిటీల జాబితాను విడుదల చేసింది. ఇందులో సీనియర్ నటీనటులు ఎంతో మంది పోటీపడ్డారు. కానీ వారందరినీ పక్కకు నెట్టి అగ్రస్థానంలో నిలిచింది నటి నితాన్షి గోయల్.

టీనేజ్​ నుంచే నితాన్షి ఓ ట్యాలెంటడ్ యాక్ట్రెస్​గా, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్​గా పేరు సంపాదించింది. ప్రస్తుతం ఈమె ఇన్​స్టాగ్రామ్ ఖాతాకు మిలియన్లలో ఫాలోవర్లు ఉన్నారు. 'మసూమ్ సవాల్', 'ఎంఎస్ ధోనీ ది లన్​టోల్డ్ స్టోరీ','ఇందూ సర్కార్' వంటి సినిమాలతో పాటు 'ఇన్​సైడ్ ఎడ్జ్', 'తాప్కీ ప్యార్ కీ' వంటి టీవీ షోల్లోనూ నటించి మెప్పించిందీ ఈ బ్యూటీ. తాజాగా బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ ప్రోడక్షన్లో వచ్చిన 'లాపతా లేడీస్' సినిమా ఈ అమ్మడికి భారీ స్థాయిలో గుర్తింపు తెచ్చి పెట్టింది. కేవలం నటనే కాకుండా నితాన్షి కథక్, హిప్ హాప్, క్లాసికల్ డ్యాన్స్​లో ప్రావిణ్యం ఉంది.

లాపతా లేడీస్ స్టోరీ ఏంటంటే ?
2001 ఏడాది బ్యాక్‍డ్రాప్‍లో ఈ స్టోరీ సాగుతుంది. దీపక్ కుమార్ (స్పర్శ్ శ్రీవాత్సవ), పూల్ కుమారి (నితాన్షి గోయల్)కు వివాహం జరుగుతుంది. ఇక ఆ తర్వాత దీపక్ దంపతులు తమ సొంత ఊరికి వెళ్లేందుకు ఓ రైలు ఎక్కుతారు. ఇక అదే ట్రైన్‍లో కొత్తగా పెళ్లయిన మరికొన్ని జంటలు కూడా ఉంటాయి. కొత్త పెళ్లి కూతుళ్లందరూ ముఖానికి ముసుగు వేసుకొని ఉంటారు. ఇక కొత్తగా పెళ్లయిన పుష్ప రాణి అలియాజ్ జయ (ప్రతిభ రంట) వద్ద రైలులో దీపక్ కుమార్, పూల్ కూర్చుంటారు. అయితే, దిగాల్సిన స్టేషన్ వచ్చిన తొందరలో రాత్రి వేళ పూల్‍ అనుకుని దీపక్ తన వెంట పుష్ప రాణిని తీసుకెళ్తాడు. ముసుగు ఉండటం వల్ల దీపక్‍ను కూడా పుష్ప చూడలేకపోతుంది. అయితే, వాళ్ల గ్రామానికి వెళ్లిన తర్వాత ఆమె పూల్ కాదు పుష్పరాణి అని తెలుసుకొని దీపక్, వారి కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాకవుతారు.ఇక అప్పటి నుంచి పూల్ కోసం దీపక్ వెతుకడం మొదలుపెడుతారు. అయితే పూల్ ఓ రైల్వే స్టేషన్‍లో దిగి అయోమయంగా తిరుగుతుంటుంది. అసలు ఈ పుష్పరాణి ఎవరు? పూల్‍కు ఏమైంది? దీపక్‍కు ఆమె దొరికిందా? ఈ క్రమంలో ఎదురైన పరిస్థితులు ఏంటి ? ఈ కథలో ఇన్‍స్పెక్టర్ శ్యామ్ మనోహర్ (రవికిషన్) పాత్ర ఏంటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

తెలుగు భామల చూపు బాలీవుడ్ వైపు- అందరి చేతిలో భారీ ప్రాజెక్ట్​లే! - Telugu Heroines Bollywood Movies

వీకెండ్ స్పెషల్​ - OTTలో 25 క్రేజీ సినిమా/సిరీస్​లు స్ట్రీమింగ్​ - This Week OTT Releases Movies

Last Updated : May 11, 2024, 2:28 PM IST

ABOUT THE AUTHOR

...view details