Geethanjali Malli Vachindi Twitter Review :టాలీవుడ్లో సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఒక సినిమా హిట్ అయితే దానికి కొనసాగింపు వచ్చేస్తోంది. అలా తాజాగా హీరోయిన్ అంజలి ప్రధాన పాత్రలో వచ్చిన సూపర్ హిట్ సినిమా గీతాంజలికి సీక్వెల్ థియేటర్లలోకి వచ్చింది. దాదాపు పదేళ్ల తర్వాత గీతాంజలి మళ్లీ వచ్చింది పేరుతో వచ్చిన ఈ చిత్రాన్ని కోన ఫిల్మ్ కార్పొరేషన్‌తో కలిసి ఎం.వి.వి.సినిమా బ్యానర్‌పై ఎం.వి.వి.సత్యనారాయణ, జీవీ నిర్మించారు. కోన వెంకట్ కథ, స్క్రీన్‌ప్లే అందించారు. అంజలికి ఇది 50వ చిత్రం. ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందిచారు. సుజాత సిద్ధార్థ్ ఛాయాగ్రహణం బాధ్యతలు చూసుకున్నారు. ఈ సినిమాకు సంబంధించిన రివ్యూలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు
Geethanjali Malli Vachindi Story :ఈ సినిమా డీసెంట్ కామెడీ హారర్ మూవీ అని అంటున్నారు. ఫస్ట్ హాఫ్‌లో కొన్నిలాగ్స్ సీన్స్ తప్పా చాలా వరకు ఎంటర్టైన్ చేశారని చెబుతున్నారు. కమెడియన్ కాస్టింగ్ అదిరిపోయిందట. సునీల్‌కు గ్రేట్ కమ్ బ్యాక్ అని అంటున్నారు.. కామెడీ సినిమాకు బాగుందని చెబుతున్నారు.
"ఫస్ట్ హాఫ్ కన్నా సెకండాఫ్ బాగుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎంటర్టైన్మెంట్ అదిరిపోయిందని అంటున్నారు. డీసెంట్ కామెడీ హారర్. ఫస్ట్ హాఫ్‌లో కొన్ని లాగ్స్ సీన్స్ తప్ప సినిమా చాలా వరకు ఎంటర్టైన్ చేసింది. కమెడియన్ కాస్టింగ్‌ను బాగా ఊపయోగించుకున్నారు. సునీల్‌కు గ్రేట్ కమ్ బ్యాక్. మొత్తంగా హారర్ టచ్‌తో మంచి ఎంటర్టైనర్."