తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'కియారాతో కిస్​ కాంట్రవర్సీ- అదంతా ప్లాన్ ప్రకారమే!'- వరుణ్ ధావన్ క్లారిటీ - VARUN DHAVAN CONTROVERSY

కాంట్రవర్సీలపై వరణ్ రియాక్షన్- అదంతా ప్లాన్ ప్రకారమే చేశారంట!

Varun Dhavan Controversy
Varun Dhavan Controversy (Source : ETV Bharat, Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Dec 25, 2024, 9:23 AM IST

Varun Dhavan Controversy :బాలీవుడ్‌ స్టార్ హీరో వరుణ్‌ ధావన్‌ తన తోటి నటీమణుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తారంటూ ఆయనపై కొన్ని రోజులుగా విమర్శలు వస్తున్నాయి. అయితే ఆ ఆరోపణలపై వరుణ్ స్పందిచారు. ఒక ఈవెంట్‌లో అలియా భట్‌ ప్రైవేట్‌ పార్ట్స్‌ పట్టుకోవడం, షూటింగ్‌లో కియారా అడ్వాణీని పబ్లిక్​గా కిస్ చేయడంపై ఆయన క్లారిటీ ఇచ్చారు. తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో వీటిపై వరుణ్ మాట్లాడారు.

'నటీనటులందరితో షూటింగ్‌ సమయంలో నేను ఒకేలా ఉంటాను. నా సహనటులతో ఎన్నోసార్లు సరదాగా ఇలా ప్రవర్తించాను. కానీ, ఆ విషయం గురించి ఎవరూ ప్రస్తావించలేదు. అయితే ఈ విమర్శలపై మీరు ఈ ప్రశ్న అడిగినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికైనా ఈ విషయంలో క్లారిటీ ఇచ్చే అవకాశం నాకు దక్కింది. కియారాను ఉద్దేశపూర్వకంగా నేను పబ్లిక్​గా ముద్దు పెట్టుకోలేదు. ఒక మ్యాగజైన్‌ ఫొటోషూట్‌లో కోసం అలా చేశాం. ఆ క్లిప్‌ను నేను, కియారా ఇద్దరం సోషల్‌ మీడియాలో షేర్ కూడా చేశాం. ఇదంతా ప్లాన్‌ చేసి చేశాము. ఆమె ఒక మంచి నటి. ఇక అలియా భట్ విషయానికొస్తే, ఆమె నాకు మంచి ఫ్రెండ్. ఆరోజు సరదాగా అలా చేశాను అంతే. కావాలని చేసింది కాదు. అది సరసాలాడడం కాదు, మేమిద్దరం ఇప్పటికీ మంచి స్నేహితులమే' హీరో వరుణ్ క్లారిటీ ఇచ్చారు.

కాగా, ప్రస్తుతం వరుణ్‌ ధావన్ 'బేబీ జాన్‌' సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. ఈ సినిమా క్రిస్మస్ సందర్భంగా బుధవారం గ్రాండ్​గా రిలీజైంది. ఈ సినిమా తమిళ 'తెరి'కు రీమెక్​గా తెరకెక్కింది. హీరోయిన్ కీర్తి సురేశ్ ఈ సినిమాతోనే బాలీవుడ్​లో ఎంట్రీ ఇచ్చింది. ప్రముఖ దర్శకుడు అట్లీ ఈ సినిమాకు కథ అందించగా, కాలీస్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో నటి వామికా గబ్బీ, జాకీ ష్రాఫ్‌ కీలక పాత్రలు పోషించగా, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్‌ అతిథి పాత్రలో కనిపించారు. డైరెక్టర్ అట్లీ దీనికి సహ నిర్మాతగానూ వ్యవహరించారు.

సినిమాగా రానున్న 'సిటడెల్‌' పార్ట్‌2!- హీరో హింట్ నిజమేనా?

కీర్తి సురేశ్ బాలీవుడ్ డెబ్యూ మూవీ -​ రెమ్యునరేషన్ ఎన్ని కోట్లంటే?

ABOUT THE AUTHOR

...view details