Hero Raviteja Injured :టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ తాజాగా షూటింగ్లో గాయపడ్డారు. 'ఆర్టీ 75' చిత్రీకరణ సమయంలో రవితేజ కుడిచేతికి గాయమవ్వగా, ఆ నొప్పితోనే షూటింగ్లో ఆయన పాల్గొన్నారు. అయినప్పటికీ గాయం ఎక్కువ కావడం వల్ల చిత్ర యూనియ్ ఆయన్ను ఆస్పత్రికి తరలించగా, అక్కడ డాక్టర్లు రవితేజకు శస్త్రచికిత్స చేసి, ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.
ఏమైందంటే?
హీరో రవితేజ ప్రస్తుతం '#RT75' అనే వర్కింగ్ టైటిల్‌తో తెరక్కెక్కుతున్న సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే సినిమా చిత్రీకరణలో భాగంగానే గురువారం షూట్ జరుగుతున్న సమంలో రవితేజకు గాయమైంది. ఇక రవితేజ గాయపడిన విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా 'గెట్ వెల్ సూన్' అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక '#RT 75'లో రవితేజ సరసన శ్రీలీల నటిస్తుండగా, ఈ మూవీతోనే రచయిత భాను భోగవరపు డైరెక్టర్‌గా ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రూపొందుతున్నట్లు సినీ వర్గాల మాట.