తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'ఆ ఉత్తరంలో ఏముంది?' - యాక్షన్​తో అదరగొట్టిన కిరణ్ అబ్బవరం - ఉత్కంఠగా 'క' ట్రైలర్ - KIRAN ABBAVARAM KA MOVIE TRAILER

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్‌ అబ్బవరం హీరోగా నటించిన 'క' చిత్రం ట్రైలర్ రిలీజ్​ - యాక్షన్ సన్నివేశాలతో అదరగొట్టిన హీరో

Kiran Abbavaram ka Movie trailer
Kiran Abbavaram ka Movie trailer (source ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Oct 25, 2024, 10:23 AM IST

Updated : Oct 25, 2024, 11:13 AM IST

Kiran Abbavaram ka Movie trailer :టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్‌ అబ్బవరం హీరోగా నటించిన తొలి పాన్‌ ఇండియా మూవీ 'క'. తన్వీ రామ్‌ హీరోయిన్​గా నటించింది. ఈ చిత్రానికి సుజిత్‌, సందీప్‌ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. దీపావళి కానుకగా అక్టోబర్‌ 31న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గర పడడంతో చిత్ర బృందం తాజాగా 'క' ట్రైలర్‌ను విడుదల చేసింది. ఉత్కంఠకు గురిచేసే సన్నివేశాలతో ఈ ప్రచార చిత్రం ఆద్యంతం ఆకట్టుకునేలా సాగింది. ఇందులో కిరణ్‌ అబ్బవరం నటన, సంభాషణలు, యాక్షన్‌ సన్నివేశాలు సినిమాపై పెంచేలా ఉన్నాయి.

2 నిమిషాల 45 సెకన్న నిడివి గల ఈ 'క‌' ట్రైలర్ మొదట యాక్షన్ సన్నివేశంతో మొదలైంది. చుట్టూ కొండల మధ్య ఉన్న కృష్ణగిరి అనే అందమైన ఊరులో, మధ్యాహ్నానికే చీకటి పడిపోతుంది. అందుకే ఆ ఊరు ఎంతో ప్రత్యేకం. అక్కడే పోస్ట్ మ్యాన్‌గా జాయిన్ అవుతాడు అభినయ వాసుదేవ్ (కిరణ్ అబ్బవరం). ఆ తర్వాత అదే ఊరిలోని సత్యభామ అనే అందమైన అమ్మాయితో ప్రేమలో పడతాడు. అయితే ఉత్తరాలు పంచే క్రమంలో 1979 ఏప్రిల్ 22న అభిషేక్ పేరుతో వచ్చిన ఓ ఉత్తరం వాసుదేవ్ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. అసలు ఆ ఉత్తరంలో ఏముంది? అని చెప్పమంటూ ఓ ముసుగు వ్యక్తి వాసుదేవ్‌‌ను బెదిరించడం, ఆ తర్వాత వాసుదేవ్‌‌ను ఆ ముసుగు వ్యక్తి, అతడి గ్యాంగ్ వెంటాడం? ఈ క్రమంలోనే వాసుదేవ్​ వెనుదిరిగి వారిని చంపడం ఆసక్తిని కలిగించాయి. మరి ఇంతకీ ఆ ఉత్తరంలో ఏముందో తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి ఉండాల్సిందే.

మొత్తంగా ఈ ప్రచారం ఉత్కంఠకు గురి చేసే సన్నివేశాలతో సాగింది. ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడుద‌లైన గ్లింప్స్‌, టీజ‌ర్‌, పాట‌లు కూడా అల‌రించాయి. కిర‌ణ్ అబ్బ‌వ‌రం నటించిన తొలి పాన్‌ ఇండియా చిత్రం ఇదే కావడం విశేషం. తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ బాష‌ల్లోనూ ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు.

అతడు కాల్ చేసి నాతో అలా మాట్లాడాడు! : బాలీవుడ్​పై సాయి పల్లవి కీలక కామెంట్స్

రాజమౌళి కూడా టచ్‌ చేయని జానర్​లో త్రివిక్రమ్‌-బన్నీ సినిమా!

Last Updated : Oct 25, 2024, 11:13 AM IST

ABOUT THE AUTHOR

...view details