తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

రెమ్యూనరేషన్ పెంచాలి కదా మరి!: కిరణ్ అబ్బవరం

'క' సినిమా సక్సెస్ మీట్- రెమ్యూనరేషన్ పెంచేస్తున్నకిరణ్ అబ్బవరం!

Kiran Abbavaram Remuneration
Kiran Abbavaram Remuneration (Source: ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Nov 30, 2024, 5:13 PM IST

Kiran Abbavaram Remuneration :2024 దీపావళి సందర్భంగా రిలీజైన 'క' సినిమా భారీ విజయం అందకుంది. చిన్న బడ్జెట్​తో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. తాజాగా మేకర్స్​ హైదరాబాద్​లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ మీట్​కు హీరో కిరణ్ అబ్బవరం, డైరెక్టర్, మూవీటీమ్ హాజరయ్యారు. అయితే ఇక్కడ హీరో కిరణ్​కు తన రెమ్యూనరేషన్​పై ఓ ప్రశ్న ఎదురైంది.

'క సినిమా విజయం అందుకోవడంతో పారితోషికం పెంచేశారా?' అని మీడియా నుంచి కిరణ్​కు ప్రశ్న అడిగారు. దీనికి 'పెంచాలి కదా' అంటూ ఆయన స్పందించారు. 'పెంచాలి కదా. ఇన్నిరోజులు కాస్త ఇబ్బందిపడ్డాను. ఇప్పుడు కాస్త పెంచాను. నిర్మాతలకు లాభాలు వచ్చిన తర్వాతే ఆయన నుంచి నేను డబ్బులు తీసుకుంటా. ముందు నిర్మాత సేఫ్ అయ్యాకే నాకేంత అనేది ఆలోచిస్తా' అని కిరణ్ అన్నారు. ఇక 'క' సినిమా సీక్వెల్​ గురించి కూడా ఆయన మాట్లాడారు. దర్శకులు కంటెంట్ రాసి, ఫైనల్ అయ్యాకే 'క 2' ఉంటుంది. అంతలోగా వేరే సినిమాలు చేస్తున్నానని అన్నారు.

ఈటీవీ విన్​లో
ఈ బ్లాక్​బస్టర్ సినిమా రీసెంట్​గా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫామ్ ఈటీవీ విన్​లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే థియేటర్ ఫీలింగ్​కు భిన్నంగా ఈ సినిమాను ఈటీవీ విన్ ప్రేక్షకులకు ఓటీటీలో కొత్తగా ప్రజెంట్ చేస్తోది. డాల్బీ అట్మాస్‌, డాల్బీ విజన్‌లో 'క' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది. దీని కోసం దాదాపు మూడు వారాలు శ్రమించినట్లు ఈటీవీ విన్ తెలిపింది.

కాగా, ఈ సినిమా విషయానికొస్తే, యంగ్ డైరెక్టర్లు డైరెక్టర్లు సుజీత్‌ - సందీప్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. యంగ్ బ్యూటీ నయన్ సారిక హీరోయిన్​గా నటించింది. శ్రీ చక్రాస్ ఎంటర్​టైన్‌మెంట్స్‌ బ్యానర్​పై కృష్ణారెడ్డి నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 31న రిలీజై మంచి సక్సెస్ అందుకుంది. ఇక తమిళం, మలయాళంలో ఇప్పటికే రిలీజైన ఈ సినిమా క్రిస్మస్ రిలీజ్‌ చేయాలని సన్నాహాలు చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు.

ఈటీవీ విన్​లోకి 'క' మూవీ - స్ట్రీమింగ్​ ఎప్పుడంటే?

'ఆమె కష్టం గురించి చెప్పాలనుకున్నా- నా ఎమోషనల్ స్పీచ్​కు రీజన్ అదే'

ABOUT THE AUTHOR

...view details