Kajal Satyabhama Trailer:టాలీవుడ్ చందమామ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత రెండు దశాబ్దాలుగా ఆడియెన్స్‌ను అలరిస్తూనే ఉంది. అయితే కరోనా టైమ్‌లో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఈ భామ కొంత కాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చి మళ్లీ ఇప్పుడు జోరు పెంచింది. ఓ వైపు తన కొడుకు ఆలనా పాలనా చూసుకుంటూనే సినీ లైఫ్‌ను బ్యాలెన్స్ చేస్తూ ముందుకు పోతోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు 'సత్యభామ' చిత్రంతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది.
అయితే ఇప్పుడు తన కోసం ఏకంగా నందమూరి నటసింహం బాలయ్యనే రంగంలోకి దింపేందుకు రెడీ అయింది. తన కొత్త సినిమా ప్రమోషన్స్‌ను భుజాన వెసుకున్న ఈ భామ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌కు బాలయ్యను గెస్ట్‌గా పిలిచింది. బాలయ్య కూడా ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఈ విషయాన్ని మూవీ టీమ్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. 'నందమూరి బాలకృష్ణ సత్యభామ్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు రాబోతున్నారు. అందరూ రెడీగా ఉండండి' అంటూ రాసుకొచ్చింది. 'మీ క్యాలెండర్స్‌ను మార్క్ చేసుకోండి 24 మే హైదరాబాద్‌లోని ఐటీసీ కోహెనూర్‌లో సాయంత్రం 6.30గంటలకు ఈవెంట్ జరగనుంది' అని తెలిపింది.