Hero Ajith Admitted to Hospital : కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం అందింది. చెన్నైలోని అపోలో హాస్పిటల్లో చేరారని తెలిసింది. దీంతో తల ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. తమ అభిమాన హీరోకు ఏం జరిగింది? ఉన్నట్లుండి ఎందుకు ఆయన ఆస్పత్రిలో చేరారంటూ సోషల్ మీడియాలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అజిత్ త్వరగా కోలుకోవాలంటూ తెగ ట్వీట్లు చేస్తున్నారు. అయితే తల హాస్పిటల్లో చేరడం గురించి ఇప్పటివరకు ఎలాంటి అధికార ప్రకటన రాలేదు. మరోవైపు అజిత్ అనారోగ్యం బారిన పడలేదని, సాధారణ చెకప్ కోసమే హాస్పిటల్‌కు వెళ్లినట్లు కొంతమంది అంటున్నారు. అయితే వైద్యులు చెకప్‌లో కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నట్లు ఉందని చెప్పారట. దీంతో వైద్యులసూచన మేరకు అజిత్ ఆస్పత్రిలో జాయిన్ అయినట్లు చెబుతున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో ఆయన డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
అయితే అజిత్ అనారోగ్య సమస్య ఉందంటూ పొద్దున్న నుంచి జరుగుతోన్న ప్రచారాన్ని ఆయన సన్నిహిత వర్గాలు కొట్టిపడేశాయి. తల తన తర్వాతి సినిమా షూటింగ్ కోసం త్వరలోనే విదేశాలకు వెళ్లనున్నారట. వెళ్లేముందు దీనికి సంబంధించిన మెడికల్ ఫార్మాలిటీస్‌ను కంప్లీట్ చేయడానికే ఆయన ఆస్పత్రికి వెళ్లినట్లు సన్నిహితులు చెబుతున్నారు. తాము అధికారికంగా చెప్పేవరకు ఏ పుకార్లను నమ్మవద్దని అంటున్నారు.