తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'జై హనుమాన్​'కు రాముడి ఆశీర్వాదం- ధర్మంతో వీరమల్లు యుద్ధం! - Harihara Veera Mallu Teaser - HARIHARA VEERA MALLU TEASER

Harihara Veera Mallu Teaser : శ్రీ రామ నవమి సందర్భంగా పలువురు టాలీవుడ్ మూవీ మేకర్స్ తమ సినిమాలకు సంబంధించిన స్పెషల్ పోస్టర్​ను విడుదల చేశారు. ఆ ఫొటోలు మీ కోసం.

Harihara Veera Mallu Teaser
Harihara Veera Mallu Teaser

By ETV Bharat Telugu Team

Published : Apr 17, 2024, 12:09 PM IST

Harihara Veera Mallu Teaser : శ్రీ రామ నవమి పండుగను పురస్కరించుకుని పలువురు ఫిల్మ్​ మేకర్స్ తమ సినిమాలకు సంబంధించిన స్పెషల్ పోస్టర్స్​ను విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ప్రశాంత్ వర్మ 'జై హనుమాన్', పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు' పోస్టర్లు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి.

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ప్రస్తుతం 'జై హనుమాన్' సినిమాను తెరకెక్కించే పనుల్లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే అంజనాద్రి 2.0 అంటూ ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేయగా, దానికి విశేష స్పందన లభించింది. ఇప్పుడు శ్రీ రామనవమి సందర్భంగా విడుదల చేసిన పోస్టర్​ కూడా నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. వచనం ధర్మస్య రక్షణం ( మాట ధర్మాన్ని రక్షిస్తుంది) అంటూ క్యాప్షన్​ను జోడించారు. ఇక ఆ పోస్టర్​లో శ్రీ రామునికి ఆంజనేయుడు మాట ఇస్తున్నట్లు వారి ఇద్దరి చేతులను చూపించారు. ఈ పోస్టర్​ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.

త్వరలో వీరమల్లు యుద్ధం
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లీడ్​ రోల్​లో రానున్న లేటెస్ట్ మూవీ 'హరిహర వీరమల్లు'. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అయితే తాజాగా మేకర్స్ ఓ సాలిడ్ అప్​డేట్​ను అందించారు. శ్రీ రామ నవమి సందర్భంగా ఈ మూవీ నుంచి ఓ స్పెషల్ పోస్టర్​ను విడుదల చేశారు. టీజర్ త్వరలో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.

"జై శ్రీరామ్​ - శ్రీరామనవమి శుభాకాంక్షలతో, మీ ముందుకు 'ధర్మం కోసం యుధ్ధం' త్వరలో!" అంటూ మేకర్స్ టీజర్ అప్​డేట్​ ఇచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టర్​ను అభిమానులు నెట్టింట తెగ ట్రెండ్ చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details