తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

పవర్​ఫుల్​గా సన్నీ దేవోల్‌ - గోపీచంద్‌ మలినేని మూవీ టైటిల్​ పోస్టర్​

సన్నీ దేవోల్‌ - గోపీచంద్‌ మలినేని మూవీ ఫస్ట్ లుక్​ పోస్టర్​ రిలీజ్​ - సినిమా టైటిల్​ ఇదే

By ETV Bharat Telugu Team

Published : 4 hours ago

Sunny Deol Gopichand Malineni Movie
Sunny Deol Gopichand Malineni Movie (source IANS)

Sunny Deol Gopichand Malineni Movie : బాలీవుడ్‌ స్టార్ యాక్టర్​్ సన్నీ దేవోల్‌ హీరోగా తెలుగు దర్శకుడు గోపీచంద్‌ మలినేని ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ఇది షూటింగ్​ దశలో ఉంది. అయితే నేడు(అక్టోబర్ 19) శనివారం సన్నీ దేవోల్‌ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం సినిమా టైటిల్‌, సన్నీ దేవోల్‌ ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేసింది. మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ చిత్రానికి జాట్‌ అనే టైటిల్‌ ఖరారు చేశారు. పోస్టర్​లో సన్నీ దేఓల్ పవర్ ఫుల్​గా కనిపించారు. పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమా రిలీజ్ కానుంది. రెజీనాతో పాటు సయామీ ఖేర్ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details