ETV Bharat / sports

క్రికెట్ హిస్టరీలో అత్యల్ప స్కోర్లు - మూడు ఫార్మాట్లలో టీమ్ఇండియా నమోదు చేసినవి ఇవే! - INDIA VS NEW ZEALAND TEST SERIES

మూడు ఫార్మాట్లలో టీమ్ఇండియా నమోదు చేసిన అత్యల్ప స్కోర్లు ఏంటో తెలుసా?

India Vs New Zealand Test Series
Team India (Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Oct 18, 2024, 12:35 PM IST

India Vs New zealand Test Series : బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌ మొదటి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా 46 పరుగులకే కుప్పకూలిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఇన్నింగ్స్ కారణంగా టీమ్ఇండియా ఖాతాలో ఓ చెత్త రికార్డు కూడా నమోదైంది. స్వదేశంలో ఆడిన టెస్టు మ్యాచ్‌ల్లో భారత్‌కిదే అత్యల్ప స్కోరు కాగా, ఓవరాల్‌గా మూడోది కావడం క్రీడాభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. రిషభ్ పంత్ (20), యశస్వి జైస్వాల్ (13) మాత్రమే రెండంకెల స్కోరు సాధించగా, రోహిత్ శర్మ, కోహ్లీ, సర్ఫరాజ్ ఖాన్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా మాత్రం అనూహ్యంగా డకౌటై వెనుతిరిగారు. ఈ నేపథ్యంలో భారత్ ఇప్పటివరకూ మూడు ఫార్మాట్లలో నమోదు చేసిన అత్యల్ప స్కోర్లు ఏంటో చూద్దామా :

ఒక్కడే రెండంకెల స్కోరు
50 ఓవర్ల క్రికెట్‌లో శ్రీలంకపై టీమ్ఇండియా అత్యల్ప స్కోరు చేసింది. 2000లో షార్జా వేదికగా జరిగిన ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌లో 54 పరుగులకే కుప్పకూలిన టీమ్ఇండియా, ఆ రిజల్ట్​తో క్రికెట్​ చరిత్రలో ఓ ఘోర పరాభవాన్ని తన ఖాతాలో వేసుకుంది. అయితే అప్పుడు భారత బ్యాటర్లలో రాబిన్ సింగ్ (11) ఒక్కడు మత్రమే రెండంకెల స్కోరు నమోదు చేశాడు. ఆ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్ చేసిన లంక 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది. దీంతో భారత్ 245 పరుగుల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.

వన్డేల్లో భారత్ అత్యల్ప స్కోర్లు ఇవే :
54 vs శ్రీలంకపై (2000, షార్జా)

63 vs ఆస్ట్రేలియాపై (1981,సిడ్నీ)

78 vs శ్రీలంకపై (1986, కాన్పూర్‌)

79 vs పాకిస్థాన్‌పై (1978, సియాల్‌కోట్)

88 vs న్యూజిలాండ్‌పై (2010, దంబుల్లా)

ఈ సారి కూడా ఆ ఒక్కడే
టీ20ల్లో భారత్ అత్యల్ప స్కోరు ఆస్ట్రేలియాపై చేసింది. 2008లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన టీమ్ఇండియా మెల్‌బోర్న్‌లో జరిగిన మ్యాచ్‌లో 74 పరుగులకే ఆలౌటైంది. భారత జట్టులోని ఇర్ఫాన్‌ పఠాన్‌ (26) ఒక్కడే డబుల్ డిజిట్ స్కోరు నమోదు చేశాడు. ఇక ఈ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా జట్టు కేవలం 11.2 ఓవర్లలోనే ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది.

టీ20ల్లో టీమ్‌ఇండియా నమోదైన అత్యల్ప స్కోర్స్‌ :
74 vs ఆస్ట్రేలియాపై (2008, మెల్‌బోర్న్‌)

79 vs న్యూజిలాండ్‌పై (2016, నాగ్‌పుర్‌)

81/8 vs శ్రీలంకపై (2021,కొలంబో)

92 vs సౌతాఫ్రికాపై (2015, కటక్)

101 vs శ్రీలంకపై (2016, పుణె)

ఆల్ సింగిల్స్
టెస్టుల్లో భారత్ అత్యల్ప స్కోరు ఆస్ట్రేలియాపై నమోదు చేసింది. 2020-21 బోర్డర్-గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా అడిలైడ్ వేదికగా తొలి టెస్టు జరగింది. అందులో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 244 పరుగులకు ఆలౌట్ కాగా, రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 36 పరుగులకే కుప్పకూలింది. అయితే భారత జట్టు అన్ని ఫార్మాట్లలోనూ నమోదు చేసిన అత్యల్ప స్కోర్ కూడా ఇదే కావడం గమనార్హం. ఇక ఈ మ్యాచ్​లో టీమ్‌ఇండియా బ్యాటర్లలో అందరూ సింగిల్‌ డిజిట్‌ స్కోరుకే పరిమితమయ్యారు. మయాంక్‌ అగర్వాల్ అత్యధికంగా 9 పరగులు చేశాడు.

టెస్టుల్లో భారత్ అత్యల్ప స్కోర్లు
36 vs ఆస్ట్రేలియాపై (2020, అడిలైడ్)

42 vs ఇంగ్లాండ్‌పై (1974, లార్డ్స్‌)

46 vs న్యూజిలాండ్‌పై (2024, బెంగళూరు)

58 vs ఆస్ట్రేలియాపై (1947, బ్రిస్బేన్)

58 vs ఇంగ్లాండ్‌పై (1952, మాంచెస్టర్)

5 డకౌట్​లు, 46 పరుగులకే ఆలౌట్​ - 92 ఏళ్ల భారత టెస్టు క్రికెట్ చరిత్రలో చెత్త రికార్డు

'అప్పుడు 36 ఇప్పుడు 46' - తొలి ఇన్నింగ్స్​లో టీమ్ఇండియా వైఫల్యానికి కారణాలివే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.