ETV Bharat / offbeat

నిమిషాల్లోనే "అలసందల తాలింపు" రెడీ - ఇలా చేస్తే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం!

-రొటీన్​ బ్రేక్​ఫాస్ట్​కి మించిన సూపర్​ టేస్ట్ -ఇలా ప్రిపేర్​ చేస్తే ​నిమిషాల్లోనే.. పైగా పిల్లలు ఇష్టంగా తింటారు

How to Make Alasanda Fry
How to Make Alasanda Fry (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 19, 2024, 12:01 PM IST

How to Make Alasanda Fry at Home : ప్రతిరోజు ఇడ్లీ, వడ, దోశ, ఉప్మా వంటి బ్రేక్​ఫాస్ట్​లను తిని బోర్​గా అనిపించిందా ? కొత్తగా ఏదైనా హెల్దీ రెసిపీ ట్రై చేయాలనుకుంటున్నారా ? అయితే, ఈ స్టోరీ మీ కోసమే! ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అలసందలతో చాలా త్వరగా రెడీ అయ్యే అలసందల తాలింపు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ రెసిపీని మీరు ఉదయానికి బ్రేక్​ఫాస్ట్​లా, సాయంత్రం స్నాక్స్​గా కూడా తినొచ్చు. పిల్లలు స్కూల్​ నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఇలా చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు. పైగా ఈ అలసందల తాలింపు ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇందులో మన శరీరానికి కావాల్సిన ప్రొటీన్​, విటమిన్లు అన్నీ అందుతాయని అంటున్నారు. మరి ఇక లేట్​ చేయకుండా అలసందల తాలింపు చేయడం ఎలానో మీరు చూసేయండి.

కావాల్సిన పదార్థాలు..

  • అలసందలు-2 కప్పులు
  • నూనె -2 టేబుల్‌స్పూన్లు
  • వెల్లుల్లి రెబ్బలు-8
  • ఆవాలు-టీస్పూన్​
  • జీలకర్ర-టీస్పూన్​
  • ఉల్లిపాయలు- ఒకటి
  • పచ్చిమిర్చి- నాలుగు
  • కొత్తిమీర- కొద్దిగా
  • ఉప్పు- రుచికి సరిపడా
  • ధనియాలు-టేబుల్​స్పూన్​ (వేయించుకోవాలి)
  • కారం-టీస్పూన్​
  • కరివేపాకు-2
  • నిమ్మరసం- టేబుల్​స్పూన్​

తయారీ విధానం..

  • ముందుగా అలసందలను రెండు మూడు సార్లు బాగా కడగాలి. తర్వాత ఒక అరగంట పాటు నీటిలో నానబెట్టుకోవాలి.
  • అలాగే మిక్సీలో వెల్లుల్లి రెబ్బలు, వేయించిన ధనియాలు వేసి కాస్త బరకగా గ్రైండ్​ చేసుకోండి.
  • ఇప్పుడు స్టౌ ఆన్​ చేసి కుక్కర్​ పెట్టండి. ఇందులో అలసందలను వేసి నాలుగు కప్పుల నీళ్లు పోయండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి కుక్కర్​ మూత పెట్టి.. మూడు విజిల్స్​ వచ్చే వరకు ఉడికించుకోండి.
  • కుక్కర్లో ఆవిరి పోయిన తర్వాత అలసందలలోని నీటిని జల్లించి ఒక ప్లేట్లోకి తీసుకోండి.
  • ఇప్పుడు అలసందలను తాలింపు పెట్టడానికి స్టౌపై పాన్ పెట్టండి. పాన్​లో ఆయిల్​ వేసి హీట్​ చేయండి. ఇందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి ఫ్రై చేయండి.
  • ఇవి వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, బరకగా గ్రైండ్ ధనియాల పేస్ట్​ వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి.
  • ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఇందులో ఉడికించుకున్న అలసందలు వేసి బాగా కలుపుకోండి.
  • అలాగే కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి మిక్స్​ చేయండి. చివర్లో కొద్దిగా కొత్తిమీర, నిమ్మరసం పిండి స్టౌ ఆఫ్​ చేయండి.
  • అంతే ఇలా సింపుల్​గా చేసుకుంటే ఎంతో రుచికరమైన అలసందల తాలింపు రెడీ. నచ్చితే మీరు కూడా ఈ హెల్దీ బ్రేక్​ఫాస్ట్​ ట్రై చేయండి.

ఇవి కూడా చదవండి:

రెస్టారెంట్ స్టైల్ "రుమాలి రోటీ" - ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోండిలా! - చాలా రుచికరంగానూ ఉంటాయి!

బ్రేక్​ఫాస్ట్​లోకి అద్దిరిపోయే రెసిపీ - తమిళనాడు స్పెషల్ "గుంట పొంగనాలు" - నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోండిలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.