Attempt Murder on Inter Student in Kadapa District : ఏపీలోని కడప జిల్లా బద్వేలు సమీపంలోని సెంచరీ ఫ్లైవుడ్ వద్ద ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ దాడి ఘటన కలకలం రేపింది. విద్యార్థినిని రోడ్డు పక్కనే చెట్లలోకి తీసుకెళ్లి విఘ్నేశ్ అనే యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తీవ్రంగా గాయపడిన విద్యార్థినిని స్థానికులు కడప రిమ్స్‌కు తరలించారు. అనంతరం చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి చెందింది. ఘటనపై బద్వేలు గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రేమ పేరుతో 8వ తరగతి నుంచే విఘ్నేశ్ తమ కుమార్తెను వేధిస్తున్నాడని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. అతనికి వివాహమైనా వేధింపులు ఆపలేదని, ఇవాళ పెట్రోల్ పోసి నిప్పంటించాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కడప రిమ్స్‌లో చికిత్స పొందుతున్న సమయంలో విద్యార్థిని నుంచి జిల్లా జడ్జి వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. కాగా ఇప్పటికే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించి - పరారీ : స్నేహితుడి ముసుగులో విఘ్నేశ్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. కలవడానికి రమ్మని పిలిచి.. పెట్రోల్ పోసి నిప్పంటించాడు. కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్‌రాజు తెలిపిన మేరకు.. బాధిత బాలిక (16) ఓ ప్రైవేటు కాలేజీ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. కడపలోని ఓ హోటల్‌లో వంట మాస్టర్‌గా పని చేస్తున్న విఘ్నేశ్‌తో చిన్ననాటి నుంచీ స్నేహం ఉంది. అతడికి మ్యారేజ్ కాగా భార్య గర్భిణి. శుక్రవారం ఉదయం అతడు విద్యార్థినికి కాల్ చేసి శనివారం తనను కలవాలని కోరాడు. లేదంటే సూసైడ్ చేసుకుంటానని బెదిరించాడు. దాంతో ఆ బాలిక శనివారం కాలేజీ నుంచి ఆటోలో బయలుదేరగా విఘ్నేశ్ మధ్యలో ఆ ఆటో ఎక్కాడు.
ఇద్దరూ బద్వేలుకు పది కి.మీ. పరిధిలో ఉన్న పీపీకుంట చెక్‌పోస్టు వద్ద దిగి సమీపంలోని ముళ్లపొదల్లోకి వెళ్లారు. కొంతసేపటికి విఘ్నేశ్.. బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించి అక్కడినుంచి పరారయ్యాడు. కొందరు మహిళలు ఆమెను గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అమ్మాయిని హుటాహుటిన స్థానిక గవర్నమెంట్ ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్‌కు తరలించారు. 80 శాతం కాలిన గాయాలతో ఉన్న బాలిక.. ట్రీట్మెంట్ పొందుతూ ఆదివారం ఉదయం మృతిచెందింది.
ఏపీ సీఎం ఆదేశాలతో ముమ్మర గాలింపు.. పోలీసుల అదుపులో నిందితుడు
నిందితుణ్ని వెంటనే అరెస్టు చేయాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించడంతో పోలీసులు నాలుగు బృందాలు ఏర్పాటు చేశారు. వారు తీవ్రంగా గాలిస్తుండగా రాత్రి సమయంలో ఓ టీమ్‌కు నిందితుడు కనిపించడంతో అదుపులోకి తీసుకున్నారు.
ప్రియురాలిపై అనుమానం - గొంతు కోసి, కళ్లలో పొడిచి ప్రేమికుడి హత్యాయత్నం - lover attack on girlfriend
కుమార్తెపై అత్యాచారం - కేసు పెట్టాడని తండ్రిపై పగ - బెయిల్‌పై వచ్చీరాగానే!