Akhira nandan OG Movie : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా 'ఓజీ' (OG). ఈ సినిమాను డైరెక్టర్ సుజీత్ ముంబయి బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిస్తున్నారు. గతేడాది రిలీజైన గ్లింప్స్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో మూవీ కోసం పవర్ స్టార్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా గురించి మరోసారి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఓజీలో అకీరా!
ఓజీలో పవన్ తనయుడు అకీరా నందన్ కూడా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే ఫ్యాన్స్‌కి పూనకాలు రావడం ఖాయం. ఎందుకంటే పవన్‌ను స్క్రీన్‌పై చూసి అభిమానులు పూనకం వచ్చినట్లు కేరింతలు కొడతారు. అలాంటిది పవన్, ఆయన కుమారుడు అకీరా నందన్ ఒకే సినిమాలో కనిపిస్తే అభిమానుల హంగామా నెక్ట్స్ లెవెల్‌లో ఉండడం ఖాయం!
చిన్నప్పటి పాత్ర!
అయితే ఓజీలో అకీరా నందన్ పవన్ చిన్నప్పటి పాత్రను చేస్తారని సోషల్ మీడియా చర్చ జరుగుతోంది. ఇప్పటికే పవన్‌కు డైరెక్టర్ సుజీత్ అకీరా పాత్ర గురించి చెప్పారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. మరికొందరు ఓజీలో అకీరా గెస్ట్ రోల్ లేదా ప్రత్యేకమైన పాత్ర చేస్తారని అంటున్నారు. ఒకవేళ పవన్ ఓజీలో అకీరా నటిస్తే అదే అతడి డెబ్యూ మూవీ అవుతుంది.
అయితే ఓజీలో అకీరా నటిస్తాడన్న ప్రచారం చాలా రోజుల నుంచి సాగుతోంది. కానీ, రీసెంట్గా షూటింగ్ మళ్లీ ప్రారంభమైన నేపథ్యంలో మరోసారి ఈ వార్త తెరపైకి వచ్చింది. దీంతో అకీరా సినిమాలో ఉండడం పక్కా అని అభిమానులు అంచనా వేస్తున్నారు. అటు మేకర్స్ వైపు నుంచి దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
ఇక 'ఓజీ' సినిమా విషయానికొస్తే, ముంబయి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ గ్యాంగ్ స్టర్‌గా కనిపించనున్నారు. పవన్ సరసన నటి ప్రియాంక మోహన్ నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మి విలన్ రోల్ లో కనిపించనున్నారు. వీరితో పాటు అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, సీనియర్ నటుడు వెంకట్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
పవన్ కల్యాణ్ X ప్రకాశ్ రాజ్ - 'OG'లో ఇద్దరి మధ్య ఫైట్ సీన్?
పవన్ కల్యాణ్‌పై బాలీవుడ్ స్టార్ యాక్టర్ ప్రశంసలు - ఏం అన్నారంటే?