Rahul Sipligunj Rajinikanth : నాటు పాటలు పాడి రికార్డుల మోత మోగించడంలో రాహుల్ సిప్లిగంజ్ తీరే ప్రత్యేకం. ఇక నాటు నాటు పాటతో అయితే దేశవ్యాప్తంగా పేరు సంపాదించుకున్నాడు. ఏకంగా ఆస్కార్ స్టేజ్‌పైనే ప్రదర్శన ఇచ్చి ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకున్నాడు.
అయితే తాజాగా రాహుల్ సిప్లిగంజ్ జీవితంలో తాను చేసిన తప్పు గురించి మాట్లాడాడు. అందుకు ఎంతో బాధపడుతున్నానని చెప్పాడు. రజనీకాంత్‌తో దిగిన ఓ ఫొటో వైరల్‌గా మారడానికి కారణం తానే అని చెప్పుకొచ్చాడు. ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశాడు.
"రంగమార్తాండ సినిమా షూటింగ్‌తో ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణతో నాకు మంచి అనుబంధం ఏర్పడింది. ఆ మూవీ షూట్‌లో ఉన్నప్పుడు నేను రజనీ కాంత్‌కు వీరాభిమాని అని ప్రకాశ్ రాజ్‌కు తెలిసింది. దీంతో ఆయన నన్ను పిలిచి తాను రజనీ కాంత్ మూవీ షూటింగ్‌కు వెళ్తున్నట్లు చెప్పారు. నన్ను కూడా రమ్మని చెప్పారు. అలా నేను అన్నాత్తే చిత్రీకరణకు వెళ్లాను. రజనీ సర్‌కు నన్ను పరిచయం చేయగానే, వెంటనే ఆయన కాళ్లకు నమస్కారం చేశాను. అయితే అప్పుడు ఆయన మూవీ కాస్ట్యూమ్స్‌లో ఉన్నారు. అలానే నాకు ఫొటో దిగే ఛాన్స్ ఇచ్చారు. సినిమాకు సంబంధించి తన లుక్ ఇంకా విడుదల కాలేదని, కాబట్టి, సినిమా రిలీజ్ వరకు ఆ ఫొటో షేర్ చేయొద్దని చెప్పారు. దాదాపు 10 రోజులు అయిపోయాక, ఆనందం తట్టుకోలేక ఒకరోజు దాన్ని సోషల్ మీడియాలో పెట్టేశా. అది వైరల్‌గా మారింది. హీరో లుక్ బయటకు రావడం వల్ల నిర్మాణ సంస్థ కంగారు పడింది. నాకు తెలిసి జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు అదే. ఒక అభిమానిగా ఇప్పటికీ బాధపడుతుంటాను. ఆ తర్వాత దానిని డిలీట్ కూడా చేసేశాను" అని రాహుల్ సిప్లిగంజ్ అన్నారు.
హీరోయిన్స్‌లో తనకు బాలీవుడ్ భామ దీపికా పదుకొణె అంటే ఎంతో ఇష్టమని చెప్పారు రాహుల్ సిప్లిగంజ్. ఆస్కార్ వేదికపై ఆమె తమను పరిచయం చేసినప్పుడు, తాను ఎంతో సంతోషించినట్లు గుర్తుచేసుకున్నారు.
ప్రభాస్ బర్త్ డే - ఆ రోజు ఫ్యాన్స్‌కు 6 సర్ప్రైజ్లు!
రజనీ కాంత్ వేలు పెట్టడం వల్లే నా సినిమా ఫ్లాప్! - ప్రముఖ దర్శకుడు ఆరోపణలు - Rajinikanth Flop Movie