ETV Bharat / entertainment

సంక్రాంతి 'గేమ్‌ ఛేంజ్‌' - పండగ బరిలో ఏఏ సినిమాలు వస్తున్నాయంటే?

గేమ్​ఛేంజర్ సంక్రాంతి రిలీజ్​కు సిద్ధమవ్వడంతో మారిన ముగ్గుల పండగ బాక్సాఫీస్​ గురి!

author img

By ETV Bharat Telugu Team

Published : 2 hours ago

Tollywood 2025 Sankranthi Movies
Tollywood 2025 Sankranthi Movies (source ETV Bharat)

Tollywood 2025 Sankranthi Movies : పండగకి వచ్చేస్తున్నాం అంటూ అందరికన్నా ముందుగానే దర్శకనిర్మాతలు కర్చీఫ్​లు వేసి ఇంకొకరు పోటీకి రాకుండా జాగ్రత్త పడుతుంటారు. వారిలో కొంతమంది తీరా సమయం దగ్గర పడుతున్న సందర్భంలో మెల్లగా వెనక్కి జారుకుంటారు. మరోవైపు అప్పటి వరకు రేసులోనే లేని సినిమాలు బాక్సాఫీస్‌ ముందుకొచ్చేందుకు సిద్ధపడుతుంటాయి. ఈ సారి సంక్రాంతి సినిమాల రిలీజ్ విషయంలోనూ ఇదే జరిగింది. ఇంకా చెప్పాలంటే ఇప్పటికీ విడుదల విషయంలో మార్పులు చేర్పులు కొనసాగుతున్నాయి.

ఏమేం వస్తున్నాయంటే? - 2025 సంక్రాంతికి చిరంజీవి విశ్వంభర, రవితేజ 75వ చిత్రం, ప్రభాస్‌ రాజాసాబ్‌, దిల్‌రాజు శతమానం భవతి 2, వెంకటేశ్‌ - అనిల్‌ రావిపూడి సినిమా ఇలా పలు సినిమాల వస్తాయని ప్రచారం సాగింది. నాగార్జున కూడా ఈ సంక్రాంతికి వస్తారని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు రామ్‌చరణ్‌ గేమ్‌ ఛేంజర్‌ డిసెంబరు నుంచి సంక్రాంతికి మారడం వల్ల ముగ్గుల పండగ బరి మొత్తం మారింది. విశ్వంభర స్థానంలో గేమ్‌ ఛేంజర్‌, బాలకృష్ణ - బాబీ NBK 109 సంక్రాంతి రేసులోకి వచ్చాయి. నాగచైతన్య తండేల్‌ కూడా ముగ్గుల పండక్కే రిలీజ్ కావొచ్చనే ప్రచారం సాగుతోంది.

డిసెంబరు కూడా - రామ్‌చరణ్‌ గేమ్‌ ఛేంజర్‌ మొదట 2024 క్రిస్మస్​కు రానున్నట్లు తెలిపింది. కానీ ఇప్పుడు సంక్రాంతికి మారడంతో డిసెంబరు రిలీజ్ సినిమాల్లోనూ మార్పులు చోటు చేసుకున్నాయి. పలు చిన్న సినిమాలు డిసెంబర్​ గేమ్‌ ఛేంజర్‌ విడుదల తేదీకి వచ్చేందుకు రెడీ అవుతున్నాయి.

డిసెంబరు 20న ప్రియదర్శి - ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబో సినిమా సారంగపాణి జాతకం, 21న గౌతమ్‌ తిన్ననూరి మ్యాజిక్‌ సినిమాలు వస్తున్నాయి. నితిన్‌ - వెంకీ కుడుముల కాంబో రాబిన్‌హుడ్‌ డిసెంబరు 20న వచ్చేందుకు ట్రై చేస్తోంది. మంచు విష్ణు కన్నప్ప కూడా డిసెంబర్ రిలీజ్​కే ముస్తాబవుతోంది. వెట్రిమారన్‌ విడుదల పార్ట్‌ 2, ఉపేంద్ర యుఐ 20న, పతంగ్‌ 27న రానున్నాయి. ఏదేమైనా మరో నెల తర్వాత కానీ ఈ చిత్రాల రిలీజ్​ డేట్​లపై స్పష్టత వచ్చే అవకాశం కనిపించడం లేదు. చూడాలి మరి ఏ చిత్రాలు బరిలోకి దిగుతాయి.

అలా జరగడం ఎంతో ఆనందంగా ఉంది : VD 12పై విజయ్ దేవరకొండ అప్డేట్

గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌పై వెబ్‌సిరీస్‌! - టైటిల్‌ ఇదే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.