ETV Bharat / entertainment

ఏడో వారం షాకింగ్​ ఎలిమినేషన్​ - ఆ ఇద్దరిలో బయటికి వెళ్లేదెవరో తెలిసిపోయిందిగా! - BB8 TELUGU SEVENTH WEEK ELIMINATION

-ఏడో వారంలో ఏకంగా తొమ్మిది మంది నామినేట్​ -చివరి మూడు స్థానాల్లో ఉన్నది వాళ్లే

Bigg Boss 8 Telugu Seventh Week Elimination
Bigg Boss 8 Telugu Seventh Week Elimination (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 19, 2024, 5:25 PM IST

Bigg Boss 8 Telugu Seventh Week Elimination: బిగ్​బాస్​ సీజన్​8లో ఏడో వారం నామినేషన్ల రచ్చ మామూలుగా లేదు. ఇప్పటివరకు జరిగిన నామినేషన్స్​ ఒక లెక్క.. ఈ ఏడో వారం జరిగిన నామినేషన్స్ మరో లెక్క​ అన్నట్టు ఉన్నాయి. ఎందుకంటే సోమవారం ఎపిసోడ్​లో గౌతమ్-అవినాష్ మధ్య జరగిన గొడవ ఓ రకంగా ఉంటే.. మంగళవారం ఎపిసోడ్‌లో అవినాష్ - పృథ్వీ మధ్య జరిగిన గొడవ అయితే అంతకుమించి అనేలా ఉంది. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్​ కానున్నారో ఇప్పుడు చూద్దాం..

వారం రోజులు ఏం జరిగింది: సోమవారం, మంగళవారం రెండు రోజుల పాటు నామినేషన్లు జరగగా.. బుధవారం నుంచి ఓవర్​ స్మార్ట్​ టాస్క్​ గేమ్​ను కండక్ట్​ చేశాడు బిగ్​బాస్​. ఇందులో రాయల్​ క్లాన్ ఓవర్​ స్మార్ట్​ ఫోన్స్​గా, ఓజీ క్లాన్​ సభ్యులు ఓవర్​ స్మార్ట్​ ఛార్జర్​గా గేమ్​ ఆడారు. ఈ గేమ్​లో ఇరు టీమ్స్​ నుంచి చాలా గొడవలే జరిగాయి. టాస్కు ముగిసే సమయానికి ఓజీ క్లాన్​ నుంచి ఔట్ కాకుండా ఉన్న విష్ణుప్రియ, యష్మీ, మణికంఠ, ప్రేరణ, రాయల్​ క్లాన్​ నుంచి అవినాష్, గౌతమ్, నయని, హరితేజ, మెహబూబ్, గౌతమ్, రోహిణి, గంగవ్వ, టేస్టీ తేజ.. మెగా చీఫ్ కంటెండర్స్‌గా ఎంపికయ్యారు. మెగా చీఫ్ టాస్క్ అయిన 'పట్టుకో లేదా తప్పుకో'లో భాగంగా సర్కిల్‌లో ఉన్న బోన్‌ (ఎముక బొక్క)ను ముందుగా పట్టుకొన్న వాళ్లు మెగా చీఫ్ పదవికి అర్హత లేని వారిని తప్పించొచ్చు.. ఇలా ప్రతిసారి ముందుగా బోన్‌ను పట్టుకున్న వాళ్లు ఇద్దరు సభ్యుల్ని కారణాలు చెప్పి రేసు నుంచి తప్పించాల్సి ఉంటుంది అని బిగ్​బాస్​ చెప్పాడు. ఇలా చివరి వరకు మిగిలిన గౌతమ్​ మెగా చీఫ్​ అయ్యాడు.

సీజన్​ 8లో ఏడో వారం జరిగిన నామినేషన్ల ప్రక్రియలో తొలిసారిగా తొమ్మిది మంది నామినేట్ అయ్యారు. వాళ్లు.. గౌతమ్, పృథ్వీ, నిఖిల్, మణికంఠ, యష్మీ, తేజ, నబీల్, ప్రేరణ, హరితేజ. ఇక ఈ వారం నామినేషన్లు రెండు రోజులు జరిగాయి. దీంతో ఓటింగ్​ ప్రాసెస్​ మంగళవారం రాత్రి నుంచి ప్రారంభమయ్యి శుక్రవారం రాత్రి ఎండ్​ అయ్యింది. ఇక అన్అఫీషియల్​ లెక్కలు చూస్తే నిఖిల్​ మొదటి స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఆ తర్వాతి స్థానంలో నబీల్, మణికంఠ మూడో స్థానంలో ఉన్నారని తెలుస్తోంది. ఇక ఆ తర్వాతి స్థానాల్లో ప్రేరణ, యష్మీ, ప్రస్తుత మెగా చీఫ్​ గౌతమ్​ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక చివరి మూడు స్థానాల్లో హరితేజ, పృథ్వీ, టేస్టీ తేజ ఉన్నట్లు సమాచారం.

ఎలిమినేట్​ అయ్యేది ఎవరు: నిఖిల్​, నబీల్​, మణికంఠ, ప్రేరణ, యష్మీ, గౌతమ్​ ప్రస్తుతానికి సేఫ్​ జోన్​లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక టేస్టీతేజ, పృథ్వీ, హరితేజ డేంజర్​ జోన్​లో ఉన్నారట. అయితే సోషల్​ మీడియాలో వైరల్​ అవుతున్న ప్రకారం ముఖ్యంగా టేస్టీతేజ, పృథ్వీ బాటమ్​ టూలో ఉన్నారని.. తాజా సమాచారం ప్రకారం పృథ్వీ ఎలిమినేట్​ అయినట్లు తెలుస్తోంది. అయితే పృథ్వీ ఎలిమినేషన్​ ఓ రకంగా ఆడియన్స్​కు షాక్​ అని చెప్పొచ్చు. ఎందుకంటే మొదటి రెండు వారాల్లో అగ్రెషన్​తో మాటలు జారిన పృథ్వీ.. ఆ తర్వాత తగ్గించుకున్నాడు. ఇక ఫిజికల్​ టాస్కుల్లో చాలా బాగానే ఆడాడు. అయితే కేవలం టాస్కుల్లోనే పృథ్వీ కనిపిస్తున్నాడని, ఇంట్లో చాలా డల్​గా ఉంటున్నాడని.. గత వారం గంగవ్వ, ఈ వారం అవినాష్​ నామినేట్​ చేశారు. దీంతో వీళ్లిద్దరి మధ్య గొడవ బానే జరిగింది. ఒకానొక సమయంలో ఇద్దరు కొట్టుకోబోయారు కూడా. అయితే ఈవారం పృథ్వీపై పెరిగిన నెగిటివీటియే అతని ఎలిమినేట్​ కావడానికి కారణమని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఇక ఈ విషయం అఫీషియల్​గా తెలియాలంటే సండే వరకు ఆగాల్సిందే.

బిగ్​బాస్​ 8: ఆరో వారం కిర్రాక్​ సీత అవుట్​ - రెమ్యునరేషన్​ వివరాలు లీక్​!

"పక్కనోళ్ల బాధ గురించి వాడికి అక్కర్లేదు" - "వాడికి అదే సమస్య" - నాగ మణికంఠ చెల్లెలు షాకింగ్​ కామెంట్స్​!

మరో షాకిచ్చిన నాగ మణికంఠ - భార్య కంటే ఎన్నేళ్లు చిన్నోడో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.