Young Man Suicide at Palakurthi PS: జనగామ జిల్లా పాలకుర్తి పోలీస్ స్టేషన్ ఆవరణలో నిన్న(అక్టోబర్ 18)న ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన సంచలనం సృష్టించింది. అతన్ని వెంటనే వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా ఈరోజు ఉదయం మృతి చెందాడు. దీంతో ఆగ్రహించిన కుటుంబసభ్యులు, మేకల తండా వాసులు పోలిస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు.
ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులను సస్పెండ్ చేయాలని, మృతుడు శ్రీను ఆత్మహత్యకు కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలంటూ తండా వాసులు నినాదాలు చేయడంతో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. శ్రీను మృతికి కారకులైన ఆరుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.
పోలీసులకూ గాయాలు : జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో యువకుడు లకావత్ శ్రీను ఆత్మహత్య ఉద్రిక్త పరిస్ధితికి దారి తీసింది. మండలంలోని మేకలతండాకు చెందిన శ్రీను పాలకుర్తి పోలీస్ స్టేషన్ ఆవరణలో శుక్రవారం నాడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నం చేసుకున్నాడు. శ్రీనును కాపాడే ప్రయత్నంలో ఎస్సై సాయి ప్రసన్న కుమార్, కానిస్టేబుల్ రవీందర్‌లకు కూడా గాయాలయ్యాయి.
రాజకీయాల్లో నాకూ రోల్ మోడల్ ఉన్నారు - అదే నా లక్ష్యం : ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
తీవ్ర గాయాలైన శ్రీనును తొలుత పాలకుర్తి ప్రభుత్వాసుపత్రికి అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. 70 శాతం పైగా గాయాలైన శ్రీను చికిత్స పొందుతూ శనివారం(అక్టోబర్ 19)న ఉదయం మృతి చెందాడు. శ్రీను మృతి చెందిన వార్త తెలుసుకున్న తండా వాసులు మూకుమ్ముడిగా పాలకుర్తి పోలీస్ స్టేషన్ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులను సస్పెండ్ చేయాలని నినాదాలు చేశారు.
భార్య, భర్తల వివాదం: లకావత్ శ్రీనుకు పాలకుర్తి మండలం నర్సింగాపురం తండాకు చెందిన రాధికతో ఆరునెలల క్రితం వివాహమైంది. అయితే వీరిద్దరి మధ్య చిన్న చిన్న సమస్యలు రావడంతో భార్య పుట్టింటికీ వెళ్లిపోయింది. పెద్ద మనుషులు నచ్చచెప్పినా ఫలితం కనిపించకపోవడంతో శ్రీను పాలకుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
పలుమార్లు ఫిర్యాదు చేసినా భార్య తరఫున బంధువులు కొట్టినా పోలీసులు పట్టించుకోకుండా తననే హింసిస్తున్నారంటూ బాధితుడు శుక్రవారం పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు పక్షపాతంగా వ్యవహరించకుండా ఉంటే శ్రీను ఆత్మహత్య చేసుకునే వ్యక్తే కాదని ఘటనకు కారణమైన పోలీసులను సస్పెండ్ చేసి, నిందితులను కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.
ప్రజా ప్రతినిధుల పరామర్శ: పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి ఎంజీఎం ఆసుపత్రికి వెళ్లి మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు జరిగిన ఘటనపై ఆరా తీసి బాధితులను ఓదార్చి ధైర్యం చెప్పారు. మృతుడి కుటుంబానికి వెంటనే రూ.10 లక్షల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. పాలకుర్తిలో డీసీపీ రాజ మహేంద్ర నాయక్ మీడియా సమావేశం నిర్వహించి కేసు వివరాలు వెల్లడించారు.
పోలీసులే కారణం? : మరోవైపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ తలెత్తకుండా ముందు జాగ్రత్తగా పాలకుర్తి పోలీస్ స్టేషన్ ముందు భారీగా పోలీసులను మోహరించారు. ఇటు జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ జరిగిన ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐ మహేందర్ రెడ్డి, ఎస్సైలపై చర్యలు తీసుకోవాలని, గిరిజన కుటుంబానికి జరిగిన అన్యాయంపై విచారణ జరిపించి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కాగా శ్రీను భార్య రాధిక గర్భవతి అని తెలిసింది. ఇలాంటి సమయంలో భర్త మృతి చెందడం గ్రామస్థలను బాధకు గురిచేసింది.
Argument between BRS and Congress leaders At Jangaon : పాలకుర్తిలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్..
కాంగ్రెస్‌ను నమ్మితే మోసపోతాం - పాపమంటే గోసపడతాం : హరీశ్‌రావు