తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

రామ్ చరణ్ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఆ 2 క్షణాలు ఏంటో తెలుసా? - Happy Birthday Ramcharan - HAPPY BIRTHDAY RAMCHARAN

Happy Birthday Ramcharan : మెగా పవర్​స్టార్ రామ్​ చరణ్ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని రెండు అద్భుతమైన క్షణాలు ఉన్నాయట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. ఈ రెండింటిలో ఒకటి క్లీంకార పుట్టిన సంగతి గురించి చరణ్ చెప్పి ఉంటారని మీరు అనుకోవచ్చు. అది కాకుండా మరో రెండు ఉన్నాయని తెలిపారు. అవేంటంటే?

రామ్ చరణ్ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఆ 2 క్షణాలు ఏంటో తెలుసా?
రామ్ చరణ్ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఆ 2 క్షణాలు ఏంటో తెలుసా?

By ETV Bharat Telugu Team

Published : Mar 27, 2024, 11:28 AM IST

Happy Birthday Ramcharan : టాలీవుడ్‌ స్టార్ హీరో రామ్‌ చరణ్‌ పుట్టినరోజు నేడు(మార్చి 27). ఈ సందర్భంగా మెగా ఫ్యాన్స్ అంతా పండగ చేసుకుంటున్నారు. కేక్​లు కట్​ చేసి సంబరాలు చేసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆయన పేరును ట్రెండ్ చేస్తూ బర్త్​డే విషెస్ చెబుతున్నారు. అలాగే ఆయన కొత్త సినిమాల అప్డేట్స్​ను తెగ ట్రెండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న గేమ్​ ఛేంజర్​లోని జరగండి(Jaragandi Song) సాంగ్ రిలీజై తెగ ఆకట్టుకుంటోంది. అయితే తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని రెండు అద్భుతమైన క్షణాలను గురించి గ్లోబల్ స్టార్ ఓ సందర్భంలో చెప్పారు.

ఇంతకీ ఏం చెప్పారంటే? "నాన్న నా చిత్రాలు చూసిన తర్వాత డ్యాన్స్‌ బాగుందనో, ఫైట్లు బాగా చేశాననో రివ్యూస్ ఇస్తుంటారు. కథకు, పాత్రకు తగిన న్యాయం చేశావంటూ ధృవ సినిమా విషయంలో పొగిడారు. రంగస్థలం చిత్రం చూస్తూ అమ్మ బాగా ఎమోషనల్ అయింది. సినిమా అయిపోయాక బరువైన హృదయంతో నన్ను పక్కన కూర్చోమని అడిగింది. ఈ రెండు ఎప్పటికీ నా లైప్​ మరిచిపోలేని క్షణాలు" అని చరణ్‌ చెప్పుకొచ్చారు.

Ramcharan RC 16, RC 17 Updates :రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే చిరుత సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆయన తన రెండో సినిమా మగధీరతోనే ఇండస్ట్రీ హిట్ కొట్టారు. తనకంటూ సెపరేట్‌ ఫ్యాన్ బేస్​ను సంపాదించుకున్నారు. అనంతరం ఆరెంజ్‌తో డిజాస్టర్ అందుకున్నాక రచ్చ, గోవిందుడు అందరివాడేలే వంటి సినిమాలు చేశారు. ఇవి పర్వాలేదనిపించాయి. ఇక ధృవతో రూట్​ మార్చి కథలకు మరింత ప్రాముఖ్యత ఇచ్చారు. రంగస్థలంతో తనలోని పూర్తి టాలెంట్​ను బయటపెట్టి కంటతడి పెట్టించారు. అనంతరం ఆర్‌ఆర్‌ఆర్​తో అంతర్జాతీయ స్థాయిలో హిట్ కొట్టి గ్లోబల్​ స్టార్​గా(Global Star Ramcharan) ఎదిగారు. ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు శంకర్​ దర్శకత్వంలో గేమ్‌ ఛేంజర్‌ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత ఉప్పెన ఫేమ్‌ బుచ్చిబాబు దర్శకత్వంలో RC16, సుకుమార్‌ దర్శకత్వంలో RC17 చేయనున్నారు. నిర్మాతగానూ రాణిస్తున్నారాయన. సైరా, గాడ్‌ ఫాదర్‌ సహా తదితర చిత్రాలను ప్రొడ్యూస్ చేశారు.

రామ్​చరణ్ బర్త్ డే స్పెషల్- 'జరగండి' సాంగ్ వచ్చేసిందోచ్​- చెర్రీ, కియారా స్టెప్పులు చూశారా? - Game Changer Jaragandi Song

గ్లోబల్ స్టార్​ రామ్​ చరణ్​కు అదంటే చాలా భయమట! - Ramcharan Happy Birthday

ABOUT THE AUTHOR

...view details